NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రతి ఒక్కరూ చదువు కుంటేనే కుటుంబాలు అభివృద్ధి చెందుతాయి

1 min read

అక్షర ఆంధ్ర  అక్షరాస్యతా కార్యక్రమాన్ని చదువురాని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి

ఏలూరులో అక్షర ఆంధ్ర కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టరు

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: స్థానిక గానుగుల పేట 25వ నెంబరు వార్డు సచివాలయం వద్ద గురువారం ఉల్లాస్  అక్షర ఆంధ్ర అక్షరాస్యతా కార్యక్రమాన్ని జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి ఆకస్మికంగా సందర్శించారు. విద్యను అభ్యసిస్తున్న మహిళలతో మమేకం అయ్యి ప్రతి రోజు వస్తున్నారా, ఇప్పటివరకు ఎంతవరకు నేర్చుకున్నారు, మీరు ఈ వయస్సులో  చదువుకోవడం ఆనందంగా ఉందా, ఇబ్బందిగా ఉందా, మీకు చదువువస్తుందని ధైర్యం కదిలిందా, ఇలా పలు ప్రశ్నలను అడిగి సమాధానాలు రాబట్టారు. జిల్లా కలెక్టరు స్వయంగా పాఠాలు చెప్పి, వారితో చదివించి, పరీక్షలు పెట్టి, వాటిని స్వయంగా పరిశీలించి ఉత్తీర్ణత సాధించారని జిల్లా కలెక్టరు చెప్పడంతో మహిళలు ఆనందం వ్యక్తం చేశారు. అటెండెన్స్ ఎందుకు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, అన్ని సెంటర్లో అటెండెన్స్ రిజిస్టరు తప్పనిసరిగ్గా పెట్టాలని వయోజన విద్య డిడిని జిల్లా కలెక్టరు ఆదేశించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉల్లాస్ అక్షరాంధ్ర అక్షరాస్యతా కార్యక్రమాన్ని చదువురాని వారి కోసం ఏర్పాటు చేసిందని, రోజువారీ కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత రాత్రి వేళల్లో చదువు కోడానికి ఒక చక్కని అవకాశం కల్పించిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వయోజన విద్యా డిప్యూటీ డైరెక్టరు జి.సి.హెచ్. ప్రభాకర్, నగర పాలక సంస్థ కమీషనరు ఏ.భాను ప్రతాప్, తహశీల్దారు కె.గాయత్రి దేవి, వార్డు సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్ టీచర్లు కుమార ధనలక్ష్మి, అట్టాడ ఇందిరాదేవి, భౌరోతు రాజేశ్వరి, పొట్నూరి వెంకట సత్యనాగలక్ష్మి, వార్డు పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.

About Author