NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కార్మికుల వ్యతిరేక లేబర్ కోడులను అడ్డుకుందాం                                         

1 min read

ఈనెల 12న జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి.                                                   

 రైతు సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు పి.రామచంద్రయ్య సిఐటియు జిల్లా అధ్యక్షులు     పి.రాధాకృష్ణ

పత్తికొండ, న్యూస్​ నేడు:  కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మికుల వ్యతిరేక కోడులను కలిసికట్టుగా అడ్డుకుందామని, అందుకోసం ఈనెల 12న కార్మిక సంఘాలు తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు పి రామచంద్రయ్య, సిఐటియు జిల్లా అధ్యక్షులు పి. రాధాకృష్ణ పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక కన్యకా పరమేశ్వరి కళ్యాణ మండపంలో ఫిబ్రవరి 12న సార్వత్రిక సమ్మె జయప్రదానికై కేంద్ర కార్మిక సంఘాలైన ఏఐటీయూసీ, సిఐటియు  ఆధ్వర్యంలో 06_02-2026న రౌండ్ టేబుల్  సమావేశం జరిగింది.ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు పి రామచంద్రయ్య సిఐటియు జిల్లా అధ్యక్షులు పి రాధాకృష్ణ ఏఐటీయూసీ జిల్లా డిప్యూటీ కార్యదర్శి ఎన్ కృష్ణయ్య వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ‌ ఎం నబి రసూల్ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు డి రాజా సాహెబ్ వైయస్సార్ పార్టీ నాయకులు సర్పంచ్ సోమశేఖర్ హాజరై మాట్లాడారు. కార్మికులు అనేక పోరాటాలు చేసి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేస్తూ కేంద్ర బిజెపి ప్రభుత్వం నాలుగు లేబర్ కోడులు తీసుకురావటాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. తీవ్రంగావ్యతిరేకించారు. 8 గంటల పని దినం, శ్రమకు తగిన వేతనం భద్రత గల పరిస్థితులు, న్యాయం వ్యర్ధమైన సర్వీస్ రూల్స్ రిటైర్మెంట్ తర్వాత తగిన కనీస పెన్షన్ వగైరాలు వేటిని చట్టాల నిబంధనలు లోగడ గ్యారెంటీ చేయలేదని  తీవ్రంగా వ్యతిరేకించారు.

About Author