క్షేత్రస్ధాయిలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన కర్నూలు రేంజ్ డిఐజి, ఎస్పీ
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: ఎమ్మిగనూరు నియోజకవర్గం, కలుగొట్లలో మీ భూమి- మీ హక్కు పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో శుక్రవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో కర్నూలు రేంజ్ డిఐజి డాక్టర్ శ్రీ కోయ ప్రవీణ్ ఐపియస్ , కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ లు క్షేత్రస్ధాయిలో భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు.ఈ సంధర్బంగా పోలీసు అధికారులు తగిన భద్రతా ప్రమాణాలు కట్టుదిట్టంగా పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కర్నూల్ రేంజ్ డిఐజి , కర్నూల్ ఎస్పీ తెలియజేశారు. కలుగొట్ల హెలిప్యాడ్ వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి ని కర్నూల్ ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చo ను అందజేసి స్వాగతం పలికారు.


