NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

గుంతకల్లు ఎమ్మెల్యే కి సన్మానం చేసిన సాగునీటి సంఘం ఛైర్మన్

1 min read

మంత్రాలయం న్యూస్ నేడు : అనంతపురం జిల్లా.. గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సోమవారం శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శించుకునేందుకు కుటుంబ సభ్యుల తో కలిసి వచ్చారు. విషయం తెలుసుకున్న సూగురు సాగునీటి సంఘం ఛైర్మెన్ సూగురు నరసింహులు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ను శాలువా కప్పి, శ్రీ రాఘవేంద్ర స్వామి మెమోంటో అందజేసి సన్మానించారు. అనంతరం పలు విషయాల పై చర్చించారు. వీరి వెంట మంత్రాలయం సిఐ రామాంజులు, టిడిపి నాయకులు మేకల నరసింహులు ఉన్నారు.

About Author