మంత్రి ఎన్.ఎం.డి ఫారుక్ తనయుడిని కలిసిన టిడిపి నాయకులు
1 min read
హోలగుంద న్యూస్ నేడు: మైనారిటీ దుదేకుల సమస్యల పరిష్కారానికి ఎన్. ఎండి ఫారుక్ నివాసం లో టిడిపి నాయకులు వినతి నంద్యాలలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనారిటీ మరియు న్యాయశాఖ మంత్రి ఎన్.ఎం.డి ఫారుక్ నివాసంలో ఆయన తనయులు మరియు టిడిపి నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ ఎన్.ఎం.డి ఫిరోజ్ ని టిడిపి మండల కో-కన్వీనర్ జాకీర్, హొళగుంద టీడీపీ మండల మైనారిటీ అధ్యక్షుడు ముల్లా మోయిన్ మర్యాదపూర్వకంగా కలిసి హొళగుంద మండల మైనార్టీలకు సంబంధించిన పలు సమస్యలను విన్నవించారు.ప్రజా ప్రగతికి అంకితభావంతో నిరంతరం పనిచేస్తున్న ఆలూరు తెలుగుదేశం పార్టీ ఇంచార్జి వైకుంఠం జ్యోతి మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీ వైకుంఠం శివప్రసాద్ గారిరువుల సూచనలు, ఆదేశాల మేరకు ఈ సందర్భంగా హొళగుంద మండల కేంద్రంలోని ముస్లిం స్మశాన వాటిక (ఖబర్ స్థాన్)కు ప్రహరీ గోడ లేకపోవడం వల్ల మైనార్టీ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించి, స్మశాన వాటిక ప్రహరీ గోడ నిర్మాణం అత్యవసరమని కోరారు. అలాగే దుదేకుల సంఘానికి సంబంధించిన షాదీకానా ఏర్పాటు అంశాన్ని కూడా వారి దృష్టికి తీసుకువెళ్లి, పేద మైనార్టీ కుటుంబాలకు ఇది ఎంతో ఉపయోగకరమని వివరించారు.హొళగుంద మైనార్టీల సమస్యలపై సానుకూలంగా స్పందించిన ఫిరోజ్ మాట్లాడుతూ, ముస్లిం స్మశాన వాటిక ప్రహరీ గోడ నిర్మాణానికి సంబంధించి అవసరమైన అధికారిక ప్రక్రియలను త్వరితగతిన పూర్తిచేస్తామని, అలాగే దుదేకుల షాదీకానా ఏర్పాటు విషయమై కూడా సంబంధిత శాఖలతో సమన్వయం చేసి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు శ్రీధర్, ఫోటో బాస్కర్ తదితరులు పాల్గొని హొళగుంద మైనార్టీల సమస్యల పరిష్కారానికి తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు.హొళగుంద మైనారిటీ దుదేకుల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని, వారి సమస్యలపై సానుకూల దృక్పథంతో స్పందించి, పరిష్కారానికి భరోసా కల్పించిన మైనారిటీ మరియు న్యాయశాఖ మంత్రి ఎన్.ఎం.డి. ఫారుక్ ను, ఆలూరు టిడిపి ఇంచార్జి వైకుంఠం జ్యోతి కి, టిడిపి నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్.ఎం.డి. ఫిరోజ్ ను, అలాగే టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక ప్రధాని కార్యదర్శి వైకుంఠం శివప్రసాద్ ప్రసాద్ నుహొళగుంద మైనారిటీ దుదేకుల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.

