‘ పది ‘ విద్యార్థులకు మోడల్ పేపర్లు పంపిణీ
1 min read
మెరుగైన ఫలితాలు సాధించాలని దాతల సూచన
కర్నూలు, న్యూస్ నేడు : శ్రీ శంకరాస్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ హరి కిషన్ ఆశీస్సులతో కర్నూలు బి.క్యాంప్ ప్రాంతంలోని బాలికల, బాలుర ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి విద్యార్థులకు మోడల్ ప్రశ్నాపత్రాలను పంపిణీ చేశారు. శంకరాస్ మరియు ఆదర్శ విద్యాసంస్థల సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 200 మంది విద్యార్థులకు పుస్తకాలు అందజేశారు.ఈ సందర్భంగా శ్రీ ధర్మేంద్ర రూరల్ అండ్ డెవలప్మెంట్ సొసైటీ అధినేత డాక్టర్ వి.ఆర్. రావు మాట్లాడుతూ విద్యార్థులు పదవ తరగతి ఫలితాల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు ప్రతి సంవత్సరం తమ వంతు సహాయం అందిస్తున్నామని తెలిపారు.శంకరాస్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ హరి కిషన్ చొరవతో ఈ పుస్తకాలు పంపిణీ చేసినట్లు రాము యాదవ్ తెలిపారు. విద్యార్థులు కృషి చేసి కర్నూలు జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని వారు ఆకాంక్షించారు.

