హలో మాదిగ చలో హాల్వి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి
1 min read

ఎంఎస్పీ జిల్లా నాయకులు మరియు ఎమ్మార్పీఎస్ నాయకులు ఆధ్వర్యంలో కరపత్రలు విడుదల
హోలగుంద న్యూస్ నేడు : మాదిగ సమాజం దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న వివక్ష, అన్యాయాలపై గట్టిగా నిలబడేందుకు నిర్వహించనున్న “హలో మాదిగ చలో హాల్వి” కార్యక్రమాన్ని చరిత్రాత్మక విజయవంతం చేయాలని పిలుపునిస్తూ, ఎంఎస్పీ జిల్లా నాయకులు హెచ్. పకీరప్ప, ఆలూరు నియోజకవర్గం కో–ఇంచార్జ్ బి. మల్లికార్జున ఆధ్వర్యంలో అనుబంధ సంఘాల నాయకులు కరపత్రాన్ని ఘనంగా విడుదల చేశారు.ఈ ఉద్యమానికి ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు కెంచప్ప, ఎంఎస్పీ మండల అధ్యక్షుడు దేవప్ప విజయవంతం చేయాలని మాదిగల హక్కుల కోసం జరుగుతున్న పోరాటంలో ఇది కీలక మలుపు అవుతుందని స్పష్టం చేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, కౌతాళం మండలం హల్వి గ్రామంలో నిర్వహించనున్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి మాదిగ ఉద్యమానికి ప్రాణప్రతిష్ఠగా నిలిచిన, పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీ మందకృష్ణ మాదిగ ముఖ్య అతిథిగా హాజరవుతుండడం మాదిగ సమాజానికి గర్వకారణమని పేర్కొన్నారు.డాక్టర్ అంబేద్కర్ చూపిన మార్గంలో నడుస్తూ, మాదిగలకు జరుగుతున్న ద్రోహాలపై ప్రశ్నించే శక్తిగా ఈ కార్యక్రమం మారాల్సిన అవసరం ఉందని వారు ఉద్ఘాటించారు. ఇది కేవలం విగ్రహ ఆవిష్కరణ మాత్రమే కాదని, మాదిగల ఆత్మగౌరవానికి, హక్కుల సాధనకు నాంది పలికే మహోద్యమమని తెలిపారు.అందుకే మండలంలోని ప్రతి గ్రామం నుంచి మాదిగ సోదరులు, పెద్దలు, ఎంఆర్పీఎస్–ఎంఎస్పీ కమిటీ సభ్యులు లక్షలాది గుండెలతో హాల్వి వైపు తరలివచ్చి, “హలో మాదిగ చలో హాల్వి ” నినాదాన్ని ఉరుముల్లా మోగించాలని నాయకులు పిలుపునిచ్చారు.ఈ ఉద్యమ సభకు మైనార్టీ నాయకులు ఈసా, మండల నాయకులు గోవర్ధన్, శేషగిరి, కల్లప్ప, బసప్ప, రాజు, కమిటీ సభ్యులు ఉసేని, మహేష్, వీరేష్, బాబు, నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

