NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

18న బటర్ఫ్లై ఎల్ఈడి లైట్స్ ప్రారంభం: వైస్ ప్రెసిడెంట్ గడ్డం భూనేశ్వర్ రెడ్డి

1 min read

ప్యాపిలి న్యూస్ నేడు: ప్యాపిలి పట్టణంలో జాతీయ రహదారి డివైడర్ లో ఉన్న బటర్ఫ్లై ఎల్ఈడి లైట్లు 18న తేదీన ప్యాపిలి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ చటివి లక్ష్మీదేవి ఆధ్వర్యంలో ప్రారంభం ఉన్నట్లు సోమవారం వైస్ ప్రెసిడెంట్ భువనేశ్వర్ రెడ్డి పత్రికముకంగా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ అభివృద్ధి కొరకు అప్పటి మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సిఆర్ఎస్ నిధులతో 30 లక్షలు గ్రామపంచాయతీకి  2024, మార్చి 31న ప్రత్యేక నిధులు మంజూరు చేశారు. ఈ నిధులను బటర్ఫ్లై లైట్ల కోసం వినియోగించుకోవాలని అనుకున్న తరుణంలో  ఎన్నికలు రావడంతో కూటమి ప్రభుత్వం రావడంతో  జాప్యం జరిగింది, పట్టణ ప్రజలు డివైడర్లపై  లైట్లు వేయాలని ప్రస్తుత ఎమ్మెల్యే కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి ని ప్రజలు కోరగా ఆయన పంచాయతీ నిధులు ఉన్నాయని అడగ గ్రామపంచాయతీ వారు ప్రస్తుతానికి సి ఎస్ ఆర్ నిధులు ఉన్నాయని ఆయనకు విన్నవించారు, ఆయన గ్రామ అభివృద్ధి కోసం ఆ నిధులను కేటాయించాలని ఆయన కోరగా   బటర్ఫ్లై ఎల్ ఈ డి లైట్లకు సిఎస్ఆర్ నిధులు ప్రవేశపెట్టా మని వారు తెలిపారు. పట్టణ అభివృద్ధి కోసం ఈ ఎల్ ఈ డి బటర్ఫ్లై లైట్లు మంజూరు చేసినందుకు మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి, డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి కి మేజర్ గ్రామపంచాయతీ తరుపున కృతజ్ఞతలు తెలిపారు.ఈ ఎల్ ఈ డి బటర్ఫ్లై లైట్ల ను గ్రామ సర్పంచ్ అధ్వర్యంలో వార్డ్ నెంబర్స్ తో 18వ తేదీ సాయంత్రం ఏడు గంటలకు ప్రారంభిస్తున్నామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో వార్డ్ నెంబర్లు తదితరులు పాల్గొన్నారు.

About Author