NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నేటి నుండి అండర్ 13 జిల్లాస్థాయి చెస్ పోటీలు

1 min read

పోస్టర్ విడుదల చేసిన జిల్లా కలెక్టర్ కె.వెట్రీ సెల్వి

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: చెస్,సైక్లింగ్ విభాగాలలో శాప్ లీగ్  రాష్ట్ర స్థాయి ఎంపికలు, జిల్లా స్థాయి   క్రీడా పోటీలు  నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి చెప్పారు. స్థానిక కలెక్టరేట్ లోని గోదావరి సమావేశపు హాలులో సోమవారం శాప్ లీగ్ పోటీల పోస్టర్ ను జిల్లా కలెక్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆదేశాల మేరకు ఈనెల 17వ తేదీన ఏలూరు ఇండోర్ స్టేడియం లోని వెయిట్ లిఫింగ్ హాలులో ఉదయం 9 గంటల నుండి  అండర్ 13, 15, 17., 19 జిల్లా స్థాయి చెస్ పోటీలు జరుగుతాయని, అదేసమయంలో రాష్ట్ర స్థాయి ఎంపికలు నిర్వహించడం జరుగుతుందన్నారు. జిల్లా స్థాయిలో ఎంపికైన క్రీడాకారులు ఈనెల 21 మరియు 22వ తేదీలలో  తిరుపతిలో జరగబోయే రాష్ట్ర స్థాయి చెస్ పోటీలకు పంపడం జరుగుతుందన్నారు.  అదేవిధంగా జిల్లా స్థాయి అండర్ 18  సైక్లింగ్ పోటీలు, రాష్ట్ర స్థాయి ఎంపికలు ఈనెల 24వ తేదీన ఇండోర్ స్టేడియం నందు నిర్వహించడం జరుగుతుందన్నారు. జిల్లా స్థాయిలో ఎంపికైన క్రీడాకారులను ఈనెల 28వ తేదీ నుండి మార్చ్,1వ తేదీ వరకు విజయవాడలో జరగబోయే రాష్ట్ర స్థాయి సైక్లింగ్ పోటీలకు పంపడం జరుగుతుందన్నారు.  జిల్లా స్థాయి పోటీలు, రాష్ట్ర ఎంపికలలో పాల్గొనదలచిన వారు తప్పనిసరిగా రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (saap ) వెబ్సైటు http://sports.ap.gov.in/#/home/index లో ఆధార్ కార్డు ద్వారా నమోదు కావాలన్నారు.   జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి సయ్యద్ అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ  మరిన్ని వివరాలకు స్కేటింగ్ కోచ్  షేక్ ఖాసీం 9440647391, టేబుల్  టెన్నిస్ కోచ్ జి.వి.శేఖర్ 9059485538 లను సంప్రతించాలన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా జాయింటు కలెక్టరు యం.జె.అభిషేక్ గౌడ, జిల్లా రెవిన్యూ అధికారి వి.విశ్వేశ్వర రావు, ఆర్డీవో యం.అచ్యుత అంబరీష్, సెట్ వేల్ సిఇవో కె.యస్.ప్రభాకర రావు, తదితరులు పాల్గొన్నారు.

About Author