NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

భవిష్యత్ కార్యాచరణపై సమగ్రంగా చర్చ..

1 min read

హోలగుంద న్యూస్ నేడు : తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మరియు  ఎమ్మెల్యేలను మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మండల కన్వీనర్ వీరన్ గౌడ్ , మండల మైనారిటీ అధ్యక్షుడు ముల్లా మొయిన్మంగళగిరిలోని  టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో  అధ్యక్షులు  (పల్లా శ్రీనివాస్ రావు) ని హొళగుంద టీడీపీ మండల మాజీ మండల కన్వీనర్ వీరన్న గౌడ్ , టీడీపీ మండల మైనారిటీ అధ్యక్షుడు ముల్లా మోయిన్  మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, మండల స్థాయిలో కేడర్ సమీకరణ, మైనారిటీల సమస్యల పరిష్కారం, గ్రామ–బూత్ స్థాయిలో పార్టీ నిర్మాణాన్ని మరింత పటిష్టం చేయడం వంటి అంశాలపై సవివరంగా చర్చించారు. రాబోయే రోజుల్లో పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని రాష్ట్ర అధ్యక్షులు దిశానిర్దేశం చేశారు.అదేవిధంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి  వర్ల రామయ్య ని, ఆదోని ఎమ్మెల్యే  (డాక్టర్ పార్థసారథి) ని, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే  (గల్లా మాధవి) ని, మదనపల్లె ఎమ్మెల్యే (మహ్మద్ షాజహాన్ బాషా) ని, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే  (బొజ్జల సుధీర్ రెడ్డి) ని, తిరువూరు ఎమ్మెల్యే  (కొలికపూడి శ్రీనివాసరావు) ని కూడా మర్యాదపూర్వకంగా కలిసి పార్టీ ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ప్రజా సమస్యలు మరియు భవిష్యత్ కార్యాచరణపై సమగ్రంగా చర్చించడం జరిగింది.రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ రావు  నాయకత్వంలో పార్టీని మరింత బలోపేతం చేసి, ప్రజలకు చేరువయ్యే విధంగా కృషి చేస్తామని హొళగుంద నాయకులు తెలిపారు.

About Author