ఆర్యులో..క్వాంటం టెక్నాలజీపై అధ్యాపకుల శిక్షణా కార్యక్రమం
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: వికసిత్ భారత్ – వికసిత్ ఆంధ్రప్రదేశ్ 2047 లక్ష్యసాధనలో క్వాంటంటెక్నాలజీ కీలకపాత్ర పోషిస్తుందని రాయలసీమ యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ ఆచార్య వి. వెంకటబసవరావు అభిప్రాయపడ్డారు. క్వాంటం టెక్నాలజీపై కర్నూలులోని రాయలసీమ యూనివర్సిటీ, క్లస్టర్ యూనివర్సిటీల సంయుక్త భాగస్వామ్యంలో నేటినుండి వారంరోజులపాటు (16 – 21వరకు) కొనసాగనున్న అధ్యాపకుల శిక్షణా కార్యక్రమ (FDP) ప్రారంభ సమావేశాన్ని ఆయన వర్సిటీ సెనేట్ హాలులో ప్రారంభించారు. అమరావతి స్టేట్ క్వాంటం మిషన్ డైరెక్టర్ సి.వి. శ్రీధర్, CSIR – NPL కు చెందిన ప్రముఖ శాస్త్రవేత్త ఆచార్య జి. భగవన్నారాయణలు రాయలసీమ యూనివర్సిటీలో ఈ కార్యక్రమ నిర్వహణకు ఎంచుకున్నందుకు వి.సి. వారికి ధన్యవాదాలు తెలిపారు. సాధారణ కంప్యూటర్లకు క్వాంటం కంప్యూటర్లకు మధ్యఉన్న తేడాను ఆయన వివరించారు. క్వాంటం టెక్నాలజీ రంగంలో రానున్న అవకాశాలను అందిపుచ్చుకోవాల్సిందిగా విద్యార్థులకు ఆయన పిలుపునిచ్చారు. అమరావతి క్వాంటంవ్యాలీలో ప్రధానపాత్ర పోషిస్తున్న సి.వి. శ్రీధర్ రాయలసీమ యూనివర్సిటీ అధ్యాపకులు, విద్యార్థులకు వివరించడానికి విచ్చేయడం సంతోషకరమన్నారు.ఈ ప్రారంభోత్సవానికి రాయలసీమ యూనివర్సిటీ కాలేజి ప్రిన్సిపాల్ ఆచార్య సి. విశ్వనాథరెడ్డి, డీన్ ఆఫ్ అకడమిక్ అఫైర్స్ ఆచార్య సి. వి. కృష్ణారెడ్డి, IQAC డైరెక్టర్ ఆచార్య ఆర్. భరత్ కుమార్, ప్రభుత్వం పురుషుల డిగ్రీ కాలేజి ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. ఇందిరా శాంతి, KVR మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. వెంకట రెడ్డి, క్లస్టర్ యూనివర్సిటీ డీన్ ఆఫ్ అకడమిక్ అఫైర్స్ డాక్టర్ అక్తర్ బాను, డాక్టర్ వాయిజ్ తోపాటు వివిధ విభాగాల అధ్యాపకులు పాల్గొన్నారు.

