“ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ ప్రారంభోత్సవం”
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: జి. పుల్లయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మరియు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ వారి ఆధ్వర్యంలో ఐదు రోజుల వర్క్షాప్ (17.2.26 నుండి 21.2.26) ప్రారంభోత్సవ కార్యక్రమం ఈరోజు అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆర్‌టిఐహెచ్ – సిఇఒ డాక్టర్ ఆర్. హఫీజ్ బాషా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో తాను మాట్లాడుతూ”ఉత్సాహం, సృజనాత్మకత, మరియు పట్టుదల ఉంటే ఎవరైనా ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వొచ్చు. మార్కెట్ అవసరాలను గుర్తించి, ఆ దిశలో అడుగులు వేయాలి. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే సమాజానికి మార్పు తీసుకురావడం.” అని అలాగేఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఉద్యోగం కోసం వెతికేవారిని ఉద్యోగాలు సృష్టించేవారిగా మార్చడానికి రూపొందించబడింది అని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఈ కార్యక్రమాన్ని తొలిసారిగా పుల్లయ్య కళాశాలలోనే నిర్వహించడం జరిగిందని తెలియజేశారు. స్పీకర్ గా విచ్చేసిన గ్లోబల్ గ్రూప్ ఎండీ శ్రీ ఎస్. ఖాజా మాలిక్ గారు లొకల్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా తమ అనుభవాలను పంచుకున్నారు “స్థానిక వ్యాపారాన్ని నెలకొల్పడం అంత సులభం కాదు. కానీ సరైన దిశ, నైపుణ్యాలు, మరియు స్థానిక మార్కెట్ అవగాహనతో విజయం సాధించవచ్చు. నేను గ్లోబల్ గ్రూప్‌ని ప్రారంభించినప్పుడు, స్థానిక అవసరాలను తీర్చడంపై దృష్టి పెట్టాము. నేటికీ అదే విధానంతో ముందుకు వెళ్తున్నాం.”వ్యాపార రంగంలో సత్ఫలితాలు అందుకోవాలని ఇలాంటి వర్క్షాపులు విద్యార్థులకు, స్టార్ట్ అప్ ఫౌండర్లకు ఎంతో ఉపకరిస్తాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి శ్రీనివాసరావు పాల్గొని విద్యార్థులు వ్యాపారస్తులుగా తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలనుకునే వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎం గిరిధర్ కుమార్ పాల్గొన్నారు.ఈ కార్యక్రమం మొత్తం స్పాక్ డాక్టర్ హెచ్ ఎస్ అఫ్జల్ భాష ఆధ్వర్యంలో నిర్వహించబడినది.

