NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రాష్ట్రస్థాయి చదరంగం పోటీలకు నారాయణ పాఠశాల విద్యార్థుల ఎంపిక

1 min read

తిరుపతిలో జరిగే శాప్ లీగ్ పోటీల్లో ప్రతిభ చాటేందుకు సిద్ధమైన హర్షిత్, లక్షిత్

కర్నూలు, న్యూస్​ నేడు:  ఫిబ్రవరి 21న తిరుపతిలో నిర్వహించనున్న శాప్ లీగ్ రాష్ట్రస్థాయి చదరంగం పోటీలకు నారాయణ (ఏ. క్యాంపు) పాఠశాల విద్యార్థులు ఎంపికయ్యారు. ఈ విషయాన్ని నారాయణ (ఏ. క్యాంపు) క్లస్టర్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.కర్నూలులో నిర్వహించిన శాప్ లీగ్ చదరంగం ఎంపిక పోటీల్లో తమ పాఠశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారని ఆయన తెలిపారు. అండర్ -13 విభాగంలో హర్షిత్, అండర్ -15 విభాగంలో లక్షిత్ రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించడం గర్వకారణమన్నారు.విద్యార్థులను ఎంపికకు సిద్ధం చేయడంలో కీలక పాత్ర పోషించిన వ్యాయామ ఉపాధ్యాయుడు మహేష్‌ను ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్రస్థాయిలో కూడా విద్యార్థులు మెరుగైన ప్రదర్శన చేసి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

About Author