NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయులకు ఆత్మీయ సన్మానం

1 min read

హోలగుంద న్యూస్ నేడు : కోగిలతోట గ్రామంలో బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయులకు ఆత్మీయ సన్మాన కార్యక్రమం కోగిలతోట గ్రామంలో జెడ్పీహెచ్‌ఎస్ హైస్కూల్‌లో బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయులకు ఆత్మీయ సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టిడిపి మండల ప్రధాన కార్యదర్శి ఈబీజీ గోవింద్ గౌడ్ , టిడిపి మాజీ మండల కన్వీనర్ వీరన్ గౌడ్ , టిడిపి మండల మైనారిటీ అధ్యక్షుడు ముల్లా మోయిన్  మరియు ఈబీజీ యువనాయకుడు లక్ష్మీనారాయణ గౌడ్  హాజరయ్యారు.ఈ సందర్భంగా గోవింద్ గౌడ్ మరియు వీరన గౌడ్  మాట్లాడుతూ, ఉపాధ్యాయులు సమాజానికి మార్గదర్శకులని, వారు ఎక్కడ పనిచేసినా తమ సేవలతో విద్యార్థుల భవిష్యత్తును వెలిగిస్తారని అన్నారు. కోగిలతోట గ్రామానికి వారు అందించిన సేవలను స్మరించుకుంటూ వారికి కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమంలో ఉపాధ్యాయులకు శాలువాలు కప్పి పూలమాలలతో ఘనంగా సన్మానించారు. గ్రామ పెద్దలు, నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

About Author