NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కేసులు తో కాదు సత్యంతోనే పోరాటం  ఎస్డీపిఐ  స్పష్టం

1 min read

హోలగుంద న్యూస్ నేడు: ఆలూరు అసెంబ్లీ అధ్యక్షులు ఎఫ్. అబ్దుల్ హమీద్  మాట్లాడుతూ, మా పార్టీ జాతీయ అధ్యక్షులు ఏం,కే, ఫైజి ,పై నమోదు చేసిన కేసు పూర్తిగా రాజకీయ ప్రేరితమైందని మొదటి నుంచే స్పష్టంగా ప్రకటించామని తెలిపారు. రాజకీయ ప్రత్యర్థులను అణచివేయడానికి, ప్రజాస్వామ్య స్వరాన్ని బలహీనపరచడానికి ఇలాంటి కేసులను వినియోగించడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి పైన ఉందని, ముఖ్యంగా రాజ్యాంగబద్ధమైన సంస్థలపై ప్రజలకు ఉన్న విశ్వాసం దెబ్బతినకూడదని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆలూరు అసెంబ్లీ అధ్యక్షుడుఎఫ్. అబ్దుల్ హమీద్  పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థ స్వతంత్రతే భారత ప్రజాస్వామ్యానికి మూలస్థంభమని, నిజం చివరకు వెలుగులోకి వస్తుందనే నమ్మకం తమ పార్టీకి ఉందని ఆయన స్పష్టం చేశారు.మా జాతీయ అధ్యక్షులపై నమోదు చేసిన కేసులో ఎలాంటి వాస్తవ ఆధారాలు లేవని, ఇది కేవలం రాజకీయ ఒత్తిడి చర్య మాత్రమేనని ఆయన విమర్శించారు. ప్రజాస్వామ్యంలో విభిన్న అభిప్రాయాలను అణగదొక్కడం సరైంది కాదని, ప్రతిపక్ష స్వరాన్ని గౌరవించడం ప్రజాస్వామ్య సౌందర్యమని అన్నారు.ఈ నేపథ్యంలో న్యాయస్థానాలు నిష్పాక్షికంగా విచారణ జరిపి సత్యాన్ని బయటపెడతాయని తమకు పూర్తి నమ్మకం ఉందని ఎఫ్. అబ్దుల్ హమీద్  తెలిపారు. న్యాయవ్యవస్థపై ప్రజల విశ్వాసం మరింత బలపడే విధంగా తీర్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.అలాగే పార్టీ కార్యకర్తలు, అభిమానులు శాంతి, సామరస్యాలను పాటిస్తూ చట్టపరమైన మార్గంలోనే తమ పోరాటాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడటం, రాజ్యాంగ పరిరక్షణ కోసం ఎస్డీపిఐ  ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలూరు అసెంబ్లీ ఉపాధ్యక్షులు కే ,సలాం, ప్రధాన కార్యదర్శి అబ్దుల్ రెహమాన్, కార్యదర్శి ఎం, హఫీజ్, కోశాధికారి అల్లా బకాష్, కార్యవర్గ సభ్యులు మరియు బ్రాంచ్ నాయకులు పార్టీ కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

About Author