సరస్వతీ పూజలో పాల్గొన్న ఎస్సై దిలీప్ కుమార్
1 min read

హోలగుంద న్యూస్ నేడు: హోలగుంద మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ నందు పదవ తరగతి విద్యార్థుల పరీక్షలను దృష్టిలో పెట్టుకొని ఏర్పాటుచేసిన సరస్వతీ పూజలో స్థానిక ఎస్సై దిలీప్ కుమార్ మరియు వారి సిబ్బంది పాల్గొని, విద్యార్థిని విద్యార్థులకు పలు సూచనలు చేసి, విద్య ఉంటేనే సమాజంలో ఏ రంగంలో అయినా రాణించగలమని తెలిపారు కాబట్టి ప్రతి విద్యార్థి రాబోయే పదవ తరగతి పరీక్షలు బాగా రాసి మంచి ఉత్తీర్ణత శాతం సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ శాఖ తరపున పదవ తరగతి పరీక్షలు రాస్తున్న 315 మంది విద్యార్థిని విద్యార్థులకు పరీక్షల నందు ఉపయోగపడే కిట్ ప్యాడ్, పెన్నులు,పెన్సిల్స్ మొదలైనవి అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎస్సై దిలీప్ కుమార్ తో పాటు హెడ్ మాస్టర్ కబీర్, ఇతర ఉపాధ్యాయులు, ఏఎస్సై నాగరాజు, పోలీస్ సిబ్బంది షేక్షవలి,సంజీవ రాజు పాల్గొన్నారు.


