NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నందికొట్కూర్ ..జనసేన పార్టీలోకి చేరికలు

1 min read

జేఎస్పీ కండువాలు కప్పి ఆహ్వానించిన చింతా సురేష్ బాబు..

నందికొట్కూరు, న్యూస్​ నేడు: నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో 236 మంది జనసేన పార్టీలో చేరారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో నందికొట్కూరు జనసేన ఇన్చార్జి నల్లమల రవికుమార్ ఆధ్వర్యంలో బుధవారంజరిగిన కార్యక్రమానికి ఉమ్మడి కర్నూలు జిల్లా అధ్యక్షులు చింతా సురేష్ బాబు,రాష్ట్ర వాల్మీకి డైరెక్టర్ తోళ్ల మంజునాథ్, శ్రీశైలం ఇంచార్జి రౌతు అశోక్ కుమార్,రాయలసీమ ప్రోగ్రామింగ్ కమిటీ మెంబర్ శ్రీరాములు,ఐటి కోఆర్డినేటర్ లక్ష్మీ కాంత్ రెడ్డి హాజరయ్యారు.బ్రాహ్మణకొట్కూర్,నందికొట్కూరు పట్టణం మరియు కొత్తపల్లి మండలాలకు చెందినవారు పార్టీలో చేరారు.చింతా సురేష్ బాబు జనసేన పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.షేక్ వలి భాష,లక్ష్మీనారాయణ,బోరెల్లి వెంకటేష్,కొత్తపల్లె పెరుమాల ప్రవీణ్ మిత్ర బృందం 10 మంది,శ్రీనివాసులు యాదవ్, కరాటే మాస్టర్ గణేష్, భానుముక్కల హుస్సేన్ అలాగే ఆర్ఎంపీ డాక్టర్ హుస్సేన్,నందికొట్కూరు మాసుం భాష తదితరులు పార్టీలో చేరారు.ముందుగా మార్కెట్ యార్డ్ నుండి బైకులు మరియు ఆటో ర్యాలీఅనంతరం పటేల్ సెంటర్ లో జనసేన పార్టీ జెండాను ఆవిష్కరించారు.తర్వాతకేజిఎన్ ఫంక్షన్ హాల్ లో కార్యక్రమాన్ని నిర్వహించారు.పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని రాబోయే రోజుల్లో నియోజకవర్గంలో పార్టీని పటిష్టం చేయాలని ఉమ్మడి జిల్లా అధ్యక్షులు సురేష్ బాబు కార్యకర్తలకు సూచించారు.ఈ కార్యక్రమంలో రామిరెడ్డి, మద్దిలేటి,కుమార్,నవీన్ రెడ్డి, ప్రవీణ్,శేషు,ప్రభాకర్,రాజు, పుష్ప,మాధవరం రాజు తదితరులు పాల్గొన్నారు.

About Author