లీ ఫార్మా, లీ హెల్త్ డొమైన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
1 min read
ఎముకల పటిష్టతపై ప్రతి ఒక్కరూ శ్రద్ద వహించాలి
లీ ఫార్మా డైరెక్టర్ ఆళ్ళ లీలారాణి
విశాఖపట్నం , న్యూస్ నేడు: ప్రతి ఒక్కరు ఎముకల పటిష్టతపై శ్రద్ద వహించాలని, ఆరోగ్యంగా ఉండే విధంగా శరీరానికి కావాలసిన పోషకాలు తప్పనిసరిగా తీసుకోవాలని లీ ఫార్మా డైరెక్టర్ ఆళ్ళ లీలారాణి అన్నారు. లీ ఫార్మా, లీ హెల్త్ డొమైన్ సంయుక్తంగా సౌత్ ఇండియా షాపింగ్ మాల్తో కలిసి బుధవారం మాల్ ఉద్యోగుల కోసం ఉచిత ఎముకలు, కీళ్ల ఆరోగ్య వైద్య శిబిరాన్ని నిర్వహించాయి. ఈ వైద్య శిబిరం ద్వారా సుమారు 300 మంది లబ్ధి పొందారు. వీరికి హ్యాండ్ గ్రిప్, బిఎమ్ఐ, హెచ్.బి, ఆర్.బి.ఎస్, బి.పి, ఎముక ఖనిజ సాంద్రత, బాడీ కంపోజిషన్ వంటి పరీక్షలు నిర్వహించారు. పరీక్షల అనంతరం డాక్టర్.. న్యూట్రిషనిస్ట్ నివేదికలను పరిశీలించి, ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో చేసుకోవాల్సిన మార్పుల గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో క్యాంప్ కోఆర్డినేటర్లు సరోజిని, జయలక్ష్మి, న్యూట్రిషనిస్ట్ లు డాక్టర్ రాధిక, మాధురి, క్రాంతి, జీఎన్ఎం భాగ్యలత, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ రీజనల్ మేనేజర్ నవీన్, లీ ఫార్మా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


