NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సకాలంలో ఇంటి పన్నులు చెల్లించాలి

1 min read

స్వర్ణపంచాయతీ పోర్టల్ ద్వారా ఇంటి పన్నులు  చెల్లింపులు జరగాలి

ఆదోని డివిజనల్ డెవలప్మెంట్ అధికారి బాలకృష్ణా రెడ్డి

మంత్రాలయం  న్యూస్ నేడు :  సకాలంలో ఇంటి పన్నులు చెల్లించాలని అవి కూడా స్వర్ణ పంచాయతీ పోర్టల్ ద్వారా ఇంటి పన్నులు మరియు  ఇతర పన్నులు  చెల్లింపులు తప్పనిసరి జరగాలని ఆదోని డివిజనల్ డెవలప్మెంట్ అధికారి బాలకృష్ణా రెడ్డి అధికారులకు సూచించారు. బుధవారం నియోజకవర్గ కేంద్రమైన మంత్రాలయం లోని పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించి, పన్నులు మరియు పన్నే తరముల వసూళ్ల శాతం, బకాయిల స్థితి, తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పంచాయతీ అభివృద్ధి  అధికారి ఇంటింటి కీ వెళ్లి  పన్నులు  వసూలు  పూర్తి చేయాలన్నారు.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వర్ణపంచాయతీ పోర్టల్ ద్వారా అన్ని పన్నులు మరియు పన్నేతరముల చెల్లింపులు తప్పనిసరిగా ఆన్‌లైన్‌లోనే జరగాలని ఆయన తెలిపారు. గ్రామీణాభివృద్ధి మరియు పంచాయతీరాజ్ కమిషనర్  ఆదేశాల మేరకు ఫిబ్రవరి 25వ తేదీ లోపు 100శాతం పన్నులు వసూళ్లు  చేయాలని స్పష్టం చేశారు.ఈ లక్ష్యాన్ని సాధించేందుకు సంబంధిత పంచాయతీ అభివృద్ధి అధికారులు ( పిడిఓలు) , డిప్యూటీ ఎంపీడీఓ తక్షణ చర్యలు తీసుకుని, పన్నులు మరియు బకాయిల వసూళ్లను వేగవంతం చేయాలని , ప్రతి అధికారిని సమన్వయం చేసుకొని గడువులోపు  వసూళ్లు  ను పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమం లో         ఎంపీడీఓ నూర్జహాన్   మంత్రాలయం మండలం , డిప్యూటీ  ఎంపీడీఓ రామాంజనేయులు  , పీడీఓ  ఉపేంద్ర రెడ్డి ,బిల్ కలెక్టర్ హనుమంతు, మరియు  పంచాయతీ సిబ్బంది ,ఇతర  పంచాయతీ డెవలప్మెంంట్  ఆఫీసర్స్   పాల్గొన్నారు.

About Author