NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

గడువు తీరాక అనధికార నిర్మాణాలపై చర్యలు

1 min read

నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్

అక్రమ కట్టడాలపై రెడ్ పెయింటింగ్‌తో మార్క్

మిగిలిన 11 వేల నోటీసులు వెంటనే జారీ చేయండి

క్షేత్రస్థాయిలో స్వయంగా అకస్మిక తనిఖీలు చేస్తాం

ఒత్తిడులకు గురయ్యి తప్పులు చేయోద్దు

కర్నూలు, న్యూస్​ నేడు:  గురువారం నగర పరిధిలో అక్రమ లేఅవుట్లు, అనధికార నిర్మాణాలపై లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (ఎల్‌ఆర్‌యస్), బిల్డింగ్ పెనలైజేషన్ స్కీమ్‌ (బిపియస్) ల గడువు తీరిన తర్వాత తీసుకునే చర్యలను సంబంధిత వ్యక్తులకు స్పష్టంగా వివరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్, పట్టణ ప్రణాళిక విభాగ సిబ్బందికి సూచించారు. స్థానిక ఎస్బీఐ ఎంప్లాయిస్ కాలనీలోని నగరపాలక సమావేశ భవనంలో పట్టణ ప్రణాళిక విభాగ సిబ్బందితో ఎల్‌ఆర్‌యస్, బిపియస్ పథకాల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. సచివాలయాల వారీగా పథకాల దరఖాస్తులు, వాటి స్థితి, నోటీసుల జారీ, తదితర ప్రక్రియల పురోగతిపై ఆరా తీశారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ. పేద, మధ్య తరగతుల ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం ఎల్‌ఆర్‌యస్, బిపియస్ పథకాలను ప్రవేశపెట్టిందని, వాటిని సమర్థవంతంగా అమలు చేసే క్రమంలో ఎలాంటి ఒత్తిడులకు తలొగ్గి తప్పులు చేయరాదని స్పష్టం చేశారు. విధుల్లో తాను ఎప్పుడూ తప్పు చేయనని, చేయమని కూడా చెప్పనని, అదే విధంగా ప్రతి ఒక్కరూ నిబద్ధతతో వ్యవహరించాలని సూచించారు. ఒత్తిడులకు లోనై పొరపాట్లు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అయితే నగర పరిధిలో దాదాపు 360కు పైగా అనధికార లేఅవుట్లు ఉన్నాయని, వాటిలో మౌలిక సదుపాయాల కల్పనకు అవసరమైన నిధులు సమకూర్చుకోవడం ఎంతో అవసరమని పేర్కొన్నారు.నగర ప్రజలు అనధికార లేఅవుట్లు, నిర్మాణాల క్రమబద్ధీకరణ అవసరాన్ని గ్రహించి చట్టబద్ధత పొందేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావాలని కమిషనర్ పిలుపునిచ్చారు. సమావేశంలో డిప్యూటీ కమిషనర్ సతీష్ కుమార్ రెడ్డి, ఇంచార్జీ సిటీ ప్లానర్ వై.వెంకటరమణ, బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్లు, ప్లానింగ్ కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.

About Author