ప్రభుత్వ భూములను అక్రమిస్తే చట్ట పరమైన చర్యలు తప్పవు …
1 min read

ఇంచార్జి సబ్ కలెక్టర్ అజయ్ కుమార్
కర్నూలు, న్యూస్ నేడు: ఇటీవల పత్రికల్లో ప్రభుత్వ భూముల ఆక్రమణ పై వచ్చిన ప్రతికూల వార్తల పై స్పందించి క్షేత్ర స్థాయి లో సబ్ కలెక్టర్ స్థానిక ఉప తహశీల్దారు తో కలసి తనిఖీ చేశారు.ప్రభుత్వ భూములలో ఆక్రమణలకు పాల్పడితే చర్యలు తప్పవు అని , ఆక్రమణలకు గురి అయిన భూములకు ఎటువంటి అనుమతులు లేవని కానీ ఈ విధంగా ఆక్రమణలకు పాల్పడితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం వారిపై చర్యలు తప్పవు అని తెలియజేశారు.క్షేత్ర స్థాయి లో ఉన్న భూమి అంత కూడా ప్రభుత్వ భూమి అని తెలియజేశారు. అన్ని రికార్డులు పరిశీలించిన తరువాత నే ప్రభుత్వ భూమి కావున ప్రైవేటు వ్యక్తులు చేపట్టిన అన్ని పనులు నిలిపి వేయాలని , ఎటువంటి పనులు చెయ్యరాదు అని , ప్రభుత్వ భూమి హద్దులు కూడా నిర్ధారించడమైనది అని తెలియజేశారు.ఎవ్వరు కూడా ఎటువంటి పనులు చేయకుండా ఆదేశాలు జారీ చేశాము అని , భవిషత్తు అవసరాల దృష్ట్యా ప్రభుత్వ భూములకి రక్షణ అవసరం అని అవిదంగా కూడా చర్యలు చేపడతామని తెలియజేశారు. భవిష్యత్తులో ఈలాంటి వాటికి తావు లేకుండా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.

