NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రభుత్వ ప్రాధాన్యత అంశాల అమలులో ప్రజల సంతృప్తి పెంపుపై ప్రత్యేక దృష్టి

1 min read

స్వర్ణాంధ్ర-స్వచ్ఛఆంధ్ర, ఐగాట్ కర్మయోగి, డాక్యుమెంటేషన్ అప్లోడ్‌పై కలెక్టర్ జిల్లా కలెక్టర్ సమీక్ష

నంద్యాల, న్యూస్​ నేడు: ప్రభుత్వ ప్రాధాన్యత అంశాల అమలులో ప్రజల సంతృప్తి స్థాయిని పెంచే దిశగా అధికారులు సమగ్రంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని ఎన్‌ఐసి వీడియో కాన్ఫరెన్స్ హాలులో పబ్లిక్ పర్సెప్షన్, స్వర్ణాంధ్ర-స్వచ్ఛఆంధ్ర, డాక్యుమెంటేషన్ అప్లోడ్, ఐగాట్ కర్మయోగి, అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్స్ తదితర అంశాలపై జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి డి. రామునాయక్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వివిధ శాఖలకు కేటాయించిన పారామీటర్లలో ప్రజల సంతృప్తి శాతం తక్కువగా ఉన్న అంశాలను గుర్తించి తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. మున్సిపల్ పట్టణాల్లో పారిశుద్ధ్య నిర్వహణను మెరుగుపరచాలని, అన్న క్యాంటీన్లలో పరిశుభ్రత పాటిస్తూ సమయానికి నాణ్యమైన భోజనం, త్రాగునీటి సదుపాయం కల్పించాలన్నారు. ప్రతి పారామీటర్‌కు ప్రభుత్వం మార్కులు కేటాయించిన నేపథ్యంలో ఏ అంశంలోనూ నిర్లక్ష్యం చేయకుండా నిరంతర పర్యవేక్షణ ద్వారా అభివృద్ధి సాధించాలని పేర్కొన్నారు..ఐగాట్ కర్మయోగి కోర్సులు, ఈ-డాక్యుమెంటేషన్‌ అప్ లోడ్ పై చర్యలు తీసుకోండిఐగాట్ కర్మయోగి ప్లాట్‌ఫారమ్‌లో అందుబాటులో ఉన్న కోర్సులను ప్రతి ఉద్యోగి పూర్తిస్థాయిలో పూర్తి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. సిఎఫ్‌ఎంఎస్ ఐడి కలిగిన ప్రతి ఉద్యోగి కనీసం 40 కోర్సులు పూర్తి చేయాలని, లేకపోతే వార్షిక ఇంక్రిమెంట్లను నిలిపివేసే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఆదేశించారు. ఈపిటిఎస్‌కు సంబంధించిన ప్రతి దస్త్రాన్ని ఆన్‌లైన్‌లో అప్లోడ్ చేయాలని అధికారులకు సూచించారు. అన్ని శాఖల్లో కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్లలో పురోగతి సాధించేలా సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు.

About Author