NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కర్నూల్ వైద్య కళాశాలకు గ్రాస్ కటింగ్ మిషన్ వితరణ….

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  కర్నూల్ మెడికల్ కాలేజీ గ్రౌండ్ కు ఎంతో అవసరమైన రూ 85 వేల రూపాయల విలువైన గ్రాస్ కటింగ్ మిషన్ ను మెడికల్ కాలేజీ పూర్వ వైద్య విద్యార్థుల క్రికెట్ అసోసియేషన్ మరియు డా.మోహన్ రెడ్డి ,డా.రాజయ్య, డా. శారద లు కలిసి  వితరణ చేయడం జరిగింది. కాలేజీ అందలి గ్రౌండ్ నిర్వహణకు  ఎంతో అవసరమైన కటింగ్ మిషన్ ను  పూర్వ విద్యార్థుల క్రికెటర్ అసోసియేషన్, ఫ్యాకల్టీ,స్పోర్ట్స్ కమిటీ వైద్యులు ముందుకు రావడం పట్ల ఏడిఎంఈ అండ్​  కాలేజీ ప్రిన్సిపల్ డా.కే. చిట్టి నరసమ్మ వారికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీరాములు, పూర్వ విద్యార్థుల క్రికెటర్ అసోసియేషన్ సభ్యులు డాక్టర్ రవి కళాధర్ రెడ్డి, డా.రజనీకాంత్, డా.జానకిరామ్, డా.తిలక్  మహేష్, కాలేజీ స్పోర్ట్స్ కమిటీ వైస్ చైర్మన్ డా. విద్యాసాగర్, సబ్యులు డా. ప్రవీణ, డా.విజయ్ శంకర్, డా. మహేశ్వర్ రెడ్డి, వైద్య విద్యార్థులు పాల్గొన్నారు.

About Author