ఘనంగా శ్రీ మహర్షి వాల్మీకి నూతన విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం
1 min read

హోళగుంద న్యూస్ నేడు: హోళగుంద మండలంలోని హెబ్బటం గ్రామంలో నిర్వహించిన శ్రీ మహర్షి వాల్మీకి నూతన విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం ఘనంగా జరిగింది. గ్రామ పెద్దల ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆలూరు టీడీపీ ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి మరియు టిడిపి మండల ప్రధాన కార్యదర్శి ఈబిజి గోవింద్ గౌడ్ మరియు టీడీపీ సీనియర్ నాయకులు పంపాపతి మాజీ మండల కన్వీనర్ వీరన్ గౌడ్ యారీస్వామి బిజెపి మాజీ మండల కన్వీనర్ prashad జనసేవ మండల కన్వీనర్ అశోక్ దీడి వెంకటేష్ టీడీపీ మండల మైనారిటీ అధ్యక్షుడు ముల్లా మోయిన్ ల్యాబ్ గిరి బాగోడి రాము దీడి తిక్కస్వామి దీడి నాగప్ప వెంకటేష్ రామాంజీ రారావి సిద్ధూ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో వెలసిన శ్రీ శ్రీ శక్తి సవారెమ్మవ్వ వారి మహాద్వారం మరియు 11 కళశాల ప్రారంభోత్సవ వేడుకలలో కూడా ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ మహర్షి వాల్మీకి స్వామి వారి నూతన విగ్రహాన్ని ప్రతిష్ఠించి, భక్తులతో కలిసి ఆశీర్వాదాలు పొందారు.కార్యక్రమంలో పాల్గొన్న ఆలూర్ టీడీపీ ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి నీ అలానే ఈబిజి గోవింద్ గౌడ్ ని హెబ్బటం గ్రామ పెద్దలు శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ వేడుకలో గ్రామ ప్రజలు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.


