వ్యవసాయ శాఖ ఉద్యోగుల సర్వీస్ సంఘం జిల్లా అధ్యక్షులుగా కాశన్న
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: వ్యవసాయ శాఖ ఉద్యోగుల సర్వీస్ సంఘం కర్నూలు జిల్లా శాఖ జిల్లా కార్యవర్గ సమావేశం స్థానిక వ్యవసాయ శాఖ సెమినార్ హాల్ నందు జరిగినది. ఈ కార్యక్రమమునకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవికుమార్ , రాష్ట్ర కల్చరల్ కార్యదర్శి ఆదాం ఖాన్, రాష్ట్ర ఉపాధ్యక్షులు మహేంద్ర బాబు హాజరైనారు. ఈ కార్యక్రమంలో ఇటీవల జిల్లా వ్యవసాయ శాఖ ఉద్యోగుల సర్వీస్ సంఘం జిల్లా అధ్యక్షులు రవికుమార్ పదవి విరమణ చేసినందున ఈ పదవిలో జిల్లా కార్యదర్శి గా కొనసాగుతున్న ఎంసీ కాశన్న ను నియమించారు. అలాగే జిల్లా కార్యదర్శి స్థానంలో పి మహేంద్ర బాబును మరియు ఖాళీగా ఉన్న ఉపాధ్యక్షులు స్థానంలో DAO కార్యాలయంలో పనిచేయుచున్న పర్యవేక్షరాలు శ్రీదేవి ని మరియు సంయుక్త కార్యదర్శి పోస్టులో ఖాజా భాషను, మరియు రాష్ట్ర కౌన్సిలర్ పోస్టును నంద్యాల డిఏఓ ఆఫీస్ లో పనిచేయుచున్న సంజీవ ప్రసాదం కో ఆప్షన్ పద్ధతి ద్వారా అబ్జర్వర్ ఆధ్యర్యంలో ఎన్నిక చేయడమైనది. ఈ కార్యక్రమంలో కోడుమూరు తాలూకా ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాస యాదవ్ జిల్లా ఉపాధ్యక్షులు కృష్ణమోహన్ మరియు వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

