పోటీల్లో ప్రతిభ..కేజీబీవీ విద్యార్థికి 50 వేలు
1 min read
అభినందించిన ఏపీసి..జిసిడిఓ
మిడుతూరు , న్యూస్ నేడు : నంద్యాల జిల్లా మిడుతూరు కస్తూరిబా గాంధీ పాఠశాల విద్యార్థి ఆటల పోటీల్లో మంచి ప్రతిభ కనబరచినందుకు గాను అధికారులు 50 వేలు నగదును విద్యార్థినికి అందజేశారు.మిడుతూరు కేజీబివీ పాఠశాలలో చదువుతున్న పదవ తరగతి కే అక్షయ ఈనెల 21,22 తేదీల్లో తమిళనాడు జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన కెలో ఇండియా రగ్బీ పోటీల్లోఅక్షయ తృతీయ స్థానంలో నిలిచింది.అక్షయను జిల్లా అధికారులు సమగ్ర శిక్ష ఏపిసీ నిత్యానంద రాజులు మరియు జీసిడిఓ నాగ సువర్చల సోమవారం అభినందించినట్లు పాఠశాల ఎస్ఓ విజయలక్ష్మి తెలిపారు.అదేవిధంగా పాఠశాలలో ఎస్ఓ,పీఈటి సుమలత మరియు ఉపాధ్యాయులు విద్యార్థిని అభినందించారు.

