మడివాల మాచిదేవుని గుడి నిర్మాణానికి విరాళం
1 min read

టిడిపి సీనియర్ నాయకులు
ఈ.గోవింద గౌడ్ యువనాయకులు రాజేంద్ర గౌడ్ గుడి నిర్మాణకి 21000 రూపాయలు విరాళం
హోళగుంద న్యూస్ నేడు: హోళగుంద మండలంలో లోని శ్రీ సిద్దేశ్వర స్వామి గూడి ముందు రజక కుల దైవం శ్రీ శ్రీ శ్రీ మడివాల మాచిదేవుని గుడి దాదాపుగా 10 సంవత్సరం నిర్మాణం లో ఆగివున్న గుడి కి సేవాభావంతో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, హెుళగుంద మండల తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి ఈ గోవింద గౌడ్ గుడి యువ నాయకులు ఈ రాజేంద్ర గుడ్ నిర్మాణం కోసం రూ. 21,000 విరాళం అందించారు. రజక ఐక్యంగా ఉండలని కోరడంతో గ్రామాభివృద్ధి ప్రజల ఐక్యత కోసం ఎల్లప్పుడు ముందుండే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మండల టిడిపి ప్రధాన కార్యదర్శి ఈ. గోవింద గౌడ్ అండ్ సన్స్ మాట్లాడుతూ గ్రామ ప్రజలు కుల మత విభేదాలకు అతీతంగా ఐక్యంగా జీవించాలని ఆ దేవుని ఆశీర్వచనాలు ప్రతి ఒక్కరిపై ఉండాలని తెలిపారు. రజకులు భవిష్యత్ కార్యక్రమంలో ముందుంటానని తెలియజేశాడు. ఈ కార్యక్రమంలో కురుకుంద నాగరాజు.డ్రైవర్ షేకన్న. కరెంటు మల్లి ఎల్ఐసి లక్ష్మణ్ నాగేంద్ర పెద్ద ఈరన్న రజక యువకులు తదితరులు పాల్గొన్నారు.

