NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కౌతాళం గోవధ కలకలం ఇద్దరి పై కేసులు

1 min read

కౌతాళం న్యూస్ నేడు: మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో ఆవు మరియు లేగదూడను అతి కిరాతకంగా హతమార్చి మాంసం విక్రయించేందుకు ప్రయత్నించిన ఘటన స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఆదివారం తెల్లవారుజామున పెద్ద మాంసం విక్రయదారులు ఒక ఆవుని లేక దూడని తీసుకుపోతున్న అక్కడున్న హిందూ సంఘ యువకుడు దానిని గుర్తించి తీసుకెళ్తారని అడగ ఎమ్మిగనూరు సంతకని చెప్పి  నిర్మానుష ప్రదేశంలో తీసుకెళ్లి వాటిని అత మార్చడం జరిగింది ,ఈ విషయం తెలుసుకున్న హిందూ సంఘాల నాయకులు ఘటన స్థలానికి చేరుకుని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కౌతలం స్టేషన్ సీఐ అశోక్ కుమార్, కు ఫిర్యాదు చేయడం జరిగింది ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. గోవధకు పాల్పడిన వారిని చట్టపరమైన కఠిన శిక్షలు విధించాలని హిందూ సంఘాల ప్రతినిధులు స్పష్టం చేశారు. స్థానిక హిందూ సంఘాలు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.ఇలాంటి సంఘటనలు సమాజంలో శాంతి భద్రతలకు భంగం కలిగిస్తాయని, అధికారులు అప్రమత్తంగా ఉండి కఠిన చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాల నాయకులు కోరారు. కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు అక్కమ్మతో రామకృష్ణ, విశ్వహిందూ పరిషత్ సీనియర్ నాయకులు మారుతి మోహన్, బిజెపి మాజీ జిల్లా అధ్యక్షులు కునిగిరి నీలకంఠ, గిరి, చంద్ర, విజయ్ కుమార్, పరశురాం, పరమేష్, అశోక్, ఎల్లప్ప, అనిల్ కుమార్, గురు, కృష్ణ, విరాట్ హిందుస్థాన్ సంఘం నాయకులు హిందూ సంఘాలు ధార్మిక సంఘాలు నాయకులు పాల్గొన్నారు.

About Author