విద్యార్థుల అన్నం దోచుకుంటే ఊరుకోం!…. ఏఐఎస్ఎఫ్
1 min read

విద్యార్థుల కడుపు కొడుతూ,బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్న ప్రధానోపాధ్యాయుడు ను సస్పెండ్ చేయాలి
కౌతాళం న్యూస్ నేడు : కర్నూల్ జిల్లా కలెక్టర్ అధికారికి ఏఐఎస్ఎఫ్ నాయకులు వినతిపత్రం అందజేశారు.సోమవారం కౌతాళం మండల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో ప్రధానోపాధ్యాయుడు అవినీతి అక్రమాలు పై విచారణ చేపట్టాలని కర్నూలు జిల్లా ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ కి ఏఐఎస్ఎఫ్ నాయకులు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు డి.సోమన్న జిల్లా ఉపాధ్యక్షుడు యస్.ఈరేష్ మాట్లాడుతూ అక్షరాస్యతలో వెనకబడిన కౌతాళం మండలంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం అందించే డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం బియ్యాన్ని,పౌష్టిక ఆహారాన్ని ప్రధానోపాధ్యాయుడు పక్కదారి పట్టించి బియ్యాన్ని అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నాడు 16వ తేదీ సెలవు రోజు మధ్యాహ్నం సమయంలో పబ్లిక్ గా వాహనాలు ఏర్పాటు చేసుకొని పాఠశాలలో నిలువ ఉన్న బియ్యాన్ని అక్రమంగా తరలించడం జరిగింది అదేవిధంగా పదవ తరగతి విద్యార్థులకు 100 రోజుల ప్రత్యేక తరగతులు కోసం మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తే విద్యార్థులకు మధ్యన భోజనం పెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు . అలాగే అవినీతి అక్రమాలపై ప్రత్యేక అధికారిని నియమించి సమగ్ర విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ కర్నూల్ నగర అధ్యక్షుడు అభి, తదితరులు పాల్గొన్నారు.
స్పందించిన జిల్లా కలెక్టర్
జిల్లా విద్యాశాఖ అధికారిగారిని పిలిచి ప్రధానోపాధ్యాయుడిపై సమగ్ర విచారణ చేసి నివేదికను సమర్పించాలని ఆదేశించారు అనంతరం జిల్లా విద్యాశాఖ అధికారి డిప్యూటీ డిఇఓ తో విచారణ చేసి ప్రధానోపాధ్యాయుడిపై చర్యలు తీసుకుంటామని ఏఐఎస్ఎఫ్ నాయకులకు హామీ ఇచ్చారు.

