500 రూ.లకే ఆలయ పూజారిపై దాడి..
1 min read

దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి
ఆలయ కమిటీ అధ్యక్షులు వీరనాల ప్రసాద్,చట్టా మురళీ..
నందికొట్కూరు, న్యూస్ నేడు: నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో శ్రీ చౌడేశ్వరీ దేవి ఆలయ పూజారి వీరేష్ స్వామిపై దాడి చేసిన వారిపై వెంటనే కేసు నమోదు చేయాలని చౌడేశ్వరి దేవి ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు వీరనాల ప్రసాద్ మరియు ప్రధాన కార్యదర్శి చట్టా మురళి అన్నారు.ఈ సందర్భంగా దేవాలయంలో మంగళవారం పాత్రికేయుల సమావేశంలో వారు మాట్లాడుతూ సూర్యనారాయణ దేవస్థానం సురేష్ శర్మ మరియు 10 మందితో కలిసి ఇక్కడికి దేవాలయం లోపలికి వచ్చి 500 రూపాయల కోసం అనరాని మాటలు అంటూ దేవాలయంలో దాడి చేయడం మంచి పద్ధతి కాదని గుడిలో దాడి జరుగుతుంటే దేవుడికే భద్రత లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వారిపై వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.చర్యలు తీసుకోని పక్షంలో మా సంఘం ఆధ్వర్యంలో రోడ్డుపై బైటా ఇస్తామని అన్నారు.


