NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

తల్లి నుంచి కుమారుడికి కిడ్నీ దానం

1 min read

– మెడికవర్ హాస్పిటల్స్ కర్నూలులో 6వ కిడ్నీ మార్పిడి విజయవంతం

కర్నూలు, న్యూస్​ నేడు: 6వ కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించబడింది. 70 సంవత్సరాల వయస్సు గల తల్లి ఖాదర్ బీ తన కుమారుడు మహబూబ్ బాషా ప్రాణాలను కాపాడేందుకు కిడ్నీ దానం చేయడం హృదయాన్ని కదిలించే సంఘటనగా నిలిచింది. వయస్సు ఎక్కువైనా, ఆరోగ్యంగా ఉంటే అవయవ దానం చేయవచ్చని ఈ సంఘటన స్పష్టం చేసింది.కిడ్నీ వైఫల్యంతో బాధపడుతున్న మహబూబ్ బాషాకు మార్పిడి అవసరమవడంతో వైద్యులు సమగ్ర పరీక్షలు నిర్వహించి శస్త్రచికిత్సకు సిద్ధం చేశారు. ఈ క్లిష్టమైన శస్త్రచికిత్సను కన్సల్టెంట్ యూరాలజిస్ట్ & కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ఆధ్వర్యంలో నిర్వహించారు. కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ పేషెంట్ ఆరోగ్య పరిస్థితిని సమర్థంగా పర్యవేక్షించగా, శస్త్రచికిత్స సమయంలో అనస్తీషియా సేవలను కన్సల్టెంట్ అనస్తీషియాలజిస్ట్అందించారు.వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం, కిడ్నీ దానానికి ఖచ్చితమైన గరిష్ఠ వయస్సు పరిమితి ఉండదు. దాత ఆరోగ్యంగా ఉండటం ప్రధాన ప్రమాణం. సరైన వైద్య పరీక్షల అనంతరం వృద్ధులైనా కిడ్నీ దానం చేయవచ్చు. ఈ విజయవంతమైన మార్పిడి శస్త్రచికిత్స వృద్ధులు కూడా అవసరమైతే అవయవ దానం చేయగలరనే సందేశాన్ని సమాజానికి అందించింది.మెడికవర్ హాస్పిటల్స్ కర్నూలు ఆధునిక సదుపాయాలు, అనుభవజ్ఞులైన వైద్యులతో అవయవ మార్పిడి రంగంలో విశ్వసనీయ కేంద్రంగా కొనసాగుతోంది.

About Author