NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రాయలసీమ విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాలలో అతిథి ఉపన్యాసం

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:    రాయలసీమ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో “అడ్వాన్స్‌డ్ సర్ఫేస్ ఫినిషింగ్ యూజింగ్ అబ్రాసివ్ ఫ్లో మెషినింగ్: ఇన్నోవేషన్స్ ఫర్ ఆర్థోపెడిక్ ఇంప్లాంట్స్” ” అనే అంశంపై అతిథి ఉపన్యాస కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ప్రొ. పి. వెంకటసుందరానంద్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ ప్రొ. జి. వెంకటేష్ పాల్గొని ఆధునిక తయారీ సాంకేతికతల్లో అబ్రేసివ్ ఫ్లో మిషనింగ్  ప్రాముఖ్యతను వివరిస్తూ విద్యార్థులకు విలువైన సూచనలు అందించారు.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వరంగల్ ప్రొఫెసర్ ప్రొ. జి. వెంకటేష్ మాట్లాడుతూ, ఆర్థోపెడిక్ ఇంప్లాంట్స్ తయారీలో ఉపరితల మెరుగుదల  అత్యంత కీలకమని, సాంకేతికత ద్వారా ఇంప్లాంట్స్ ఉపరితల నాణ్యత, ఖచ్చితత్వం మరియు జీవ అనుకూలత  మెరుగుపడుతాయని తెలిపారు. ఈ సాంకేతికత వైద్య రంగంలో, ముఖ్యంగా మోకాలి ఇంప్లాంట్స్ తయారీలో విప్లవాత్మక మార్పులను తీసుకువస్తోందని వివరించారు.కార్యక్రమ సమన్వయకర్త ఎ. శ్రీకాంత్ కార్యక్రమం ఉద్దేశ్యాన్ని వివరించి, విద్యార్థులు పరిశోధన దృక్పథంతో ఆధునిక తయారీ విధానాలను అవగాహన చేసుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు బి.వి. శివ ప్రసాద్ రెడ్డి, టి. గాయత్రి, జి. నాగరాజు, ఎ. సర్వేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.ప్రిన్సిపాల్ ప్రొ. పి. వెంకటసుందరానంద్ మాట్లాడుతూ, ఇలాంటి సాంకేతిక ఉపన్యాసాలు విద్యార్థులలో పరిశోధనా ఆసక్తిని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. విద్యార్థులు కూడా ఆసక్తిగా పాల్గొని సందేహాలు అడిగి నివృత్తి చేసుకున్నారు.ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.

About Author