గురుకుల పాఠశాలల్లో ప్రవేశ పరీక్షలు
1 min read

నేడు 5వ తరగతి,ఇంటర్ పరీక్ష
పాఠశాల ప్రిన్సిపాల్ సత్య నారాయణ మూర్తి..
నందికొట్కూరు, న్యూస్ నేడు: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ బాలురగురుకుల పాఠశాలలో ఐదవ తరగతి మరియు ఇంటర్ మొదటి సంవత్సరంలో చేరుటకు మరియు మిగిలిన సీట్లకు 6,7,8,9,10 తరగతిలో చేరుటకు ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జుపాడు బంగ్లా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ బాలుర గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ సత్యనారాయణ మూర్తి అన్నారు.ఈ సందర్భంగా నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ గురుకుల పాఠశాలలో ప్రవేశ పరీక్షలు ఈ విధంగా ఉన్నాయి.ఈ రోజు (ఆదివారం)ఉ 9.30 నుండి 11 గం.ల వరకు మ 12 నుండి 1.30 వరకు ఇంటర్ మొదటి సంవత్సరం వారికి..మ 3 నుండి 4.30 వరకు ఐఐటి మరియు నీట్ విద్యార్థులకు పరీక్ష జరగనుంది.అదే విధంగా 6,7,8,9,10 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీ కొరకు మార్చి 8 వ తేదీ 6,7 తరగతులకు ఉ 10 నుండి 11.30 వరకు మరియు 7,8,9,19 తరగతులకు మ 2 నుండి 3.30 వరకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ తెలిపారు.దరఖాస్తులు ఆన్ లైన్ చేసుకున్న విద్యార్థులు తమ హల్ టికెట్లనుhttps://apbragcet.apcfss.in వెబ్సైట్ నుండి పొందవచ్చని మరియు విద్యార్థులు పరీక్ష కేంద్రానికి గంట ముందుగానే చేరుకోవాలని విద్యార్థులు హాల్ టికెట్ మరియు తమ ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలని అన్నారు.

