NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

గేదకు వినతి పత్రాన్ని అందజేసిన విద్యార్థి సంఘం నాయకులు

1 min read

అవినీతి హెచ్ఎం కు కొమ్ముకాస్తున్న డీఈవో

తప్పుడు నివేదిక అందించినటువంటి ఎంఈఓ 2 పై చర్యలు తీసుకోవాలి

కౌతాళంన్యూస్ నేడు: మండల కేంద్రంమైన ఉన్న జడ్పీ హైస్కూల్ అవినీతికి పాల్పడి పేద విద్యార్థుల బియ్యాన్ని బ్లాక్ మార్కెట్లో అమ్ముకున్న  హెచ్ఎం పై డిఇఓ చర్యలు తీసుకోవడం లేదని ఈరోజు వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో గేదకు వినతి పత్రాన్ని అందజేసి నిరసన తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా ఆర్ ఏ వి ఎఫ్  కృష్ణ, కాజా, ఆర్ పి ఎస్ ఎఫ్ ఆఫ్రిది,ఆర్ యు ఎస్ ఫ్,రఘు మాట్లాడుతూ కర్నూలు జిల్లా కౌతాళం మండల కేంద్ర ఉన్నటువంటి జడ్పీ హైస్కూల్లో హెచ్ఎం అవినీతికి పాల్పడడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం కింద ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందిస్తూ ఉంటే అక్కడ పని చేసేటటువంటి హెచ్ఎం మాత్రం ప్రభుత్వం నుండి వచ్చినటువంటి బియ్యాన్ని బ్లాక్ మార్కెట్లో అమ్ముకోవడం ఎంతవరకు న్యాయమని విద్యార్థుల కడుపు కొట్టి తక్కువగా వండుతూ విద్యార్థులకు అరగడుపు పెట్టి తాను సొమ్ము చేసుకోవడం దారుణమని తనని అడిగే వారే ఎవరూ లేరు అనేటటువంటి కోణంలో తన కిష్టానుసారంగా బియ్యాన్ని తరలించడం జరుగుతుందని ఆయనకు ప్రభుత్వం లక్షలకు లక్షలు జీతాలు వస్తున్న కూడా పిల్లల నోటి కాడ కూడు లాక్కొని తినడం భావ్యమేనా అని వారు ఆవేదన వ్యక్తం చేశారు దీనిపైన వీటి పైన కౌతాళం మండలం ఎంఈఓ 2 విచారణ చేయగా ఆమె కూడా హెచ్ఎం కి వత్తాసు  పలికి తప్పుడు రిపోర్టు ఇచ్చి అటు విద్యాశాఖ అధికారులను ఇటు ప్రభుత్వాన్ని మోసం చేయడం జరిగిందని వీరిద్దరి పైన పి జి ఆర్ ఎస్ లో కర్నూల్ డిఇఓ కి ఫిర్యాదు చేసినా కూడా దున్నపోతు మీద వాన కురిసినట్టు ఆయన వ్యవహరించడం తగదని ఇంతవరకు వారిపైన ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని వారిచ్చే సొమ్ములకు ఏమైనా లొంగిపోయారని వారు ఆరోపించారు ఇకనైనా ఉన్నత విద్యాధికారులు అవినీతికి పాల్పడినటువంటి హెచ్ఎం సస్పెండ్ చేసి వారికి అనుకూలంగా రిపోర్ట్ రాసినటువంటి ఎం ఈ ఓ టూ  పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు లేని పక్షంలో మరిన్ని ఉద్యమాలకు పూనుకుంటామని  హెచ్చరించారు.

About Author