NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

విద్యార్థులకు కంటెంట్ హార్డ్వేర్ టాబ్ లను అందజేసిన జిల్లా కలెక్టర్

1 min read

ఏలూరు జిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు:డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ స్టడీ సర్కిల్, విజయవాడ వారు  యూపీఎస్ సి (సివిల్ సర్వీసెస్) 2026 పరీక్షలకు హాజరు అయ్యే షెడ్యూల్డ్ కులముల విద్యార్ధులకు ఉచిత సివిల్ సర్వీసు శిక్షణ ఇచ్చుటకు ది.30-11-2025వ తేదీన నిర్వహించిన పరిక్ష (టెస్ట్) నందు ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలమునకు చెందిన 1. బొడ్డు పవన్, కైకరం గ్రామం, 2. తాడిగడప లక్ష్మణ్, కైకరం గ్రామం, 3. ఎంట్రపాటి వెంకట్రాజు, చిన వెల్లమిల్లి గ్రామం వారు ఉత్తీర్ణులైనందున, వారికి స్టడీ మెటీర్యలో బాగముగా  వైస్ ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల సహకార ఆర్ధిక సంస్థ లి., తాడేపల్లి వారు   “యూపీఎస్ సి డిజిటల్ కోచింగ్  కంటెంట్ హార్డ్వేర్  ట్యాబ్ ” లను ఈ కార్యాలయమునకు పంపి, వాటిని ఉత్తీర్ణులైన పైముగ్గురు (3) అభ్యర్డులకు  కలెక్టర్ & జిల్లా మేజిస్ట్రేట్, ఏలూరు జిల్లా వారి చేతుల మీదుగా అందించవలసినదిగా ఆదేశించియున్నారు. సదరు ఆదేశానుసారం శనివారం నాడు  కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్, ఏలూరు జిల్లా వారి చేతుల మీదుగా పై చూపిన అభ్యర్డులకు సదరు ట్యాబులను అందజేయడమైనదని ఎస్. సి. కార్పొరేషన్ ఈడి ముక్కంటి తెలిపారు. కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది ప్రభృతులు పాల్గొన్నారు.

About Author