NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఏలూరు నగర ప్రజలకు రెండు పూటలా త్రాగునీరు అందించాలన్నదే లక్ష్యం

1 min read

ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య , మేయర్ నూర్జహాన్ ఆదేశాలతో యుద్ధ ప్రాతిపదికన సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ పనులు

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: నగర ప్రజలకు వేసవికాలం సైతం రెండు పూటలు త్రాగునీరు అందించడమే లక్ష్యంగా శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబ ఆదేశాలతో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ బండ్ నిర్మాణ పనులు ప్రతిరోజు ఎలక్ట్రికల్ డి.ఈ నారాయణరావు,ఏ.ఈ పవన్,సాయి లతో కలిసి పరిశీలిస్తున్నామని కో-ఆప్షన్ సభ్యులుఎస్ ఎం ఆర్ పెదబాబు బాబు తెలిపారు.శనివారం ఉదయం దెందులూరు సమీపంలో ఉన్న గోదావరి జిల్లాల సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును పెదబాబు పరిశీలించారు.యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్న బండ్ నిర్మాణ పనులపై సంతృప్తి వ్యక్తం చేశారు.మరో పక్క గోదావరి కాలువలో నీటిమట్టం మూడు అడుగుల మేర ప్రవహించడంతో మోటార్ల ద్వారా నీటిని సక్రమంగా తోడగలుగుతున్నామన్నారు. ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్ మెయింటెనెన్స్,మోటార్ల మెయింటినెన్స్ పనులు ఎప్పటికప్పుడే పర్యవేక్షిస్తున్నామన్నారు.ఎమ్మెల్యే చంటి మేయర్ నూర్జహాన్ ఆదేశాలతో నిరంతరం జరుగుతున్న పర్యవేక్షణ కారణంగా ప్రస్తుతం నగర ప్రజలకు త్రాగునీరు ఇబ్బంది లేకుండా సరఫరా చేయగలమనే నమ్మకం ఏర్పడుతుందన్నారు. నగర ప్రజలు త్రాగునీటిని వృధా చేయకుండా ఉపయోగించుకోవాలని ఎస్ ఎం ఆర్ పెదబాబు నగర ప్రజలను కోరారు. వీరితోపాటు కార్పొరేటర్లు సబ్బన శ్రీనివాసరావు,పాము శామ్యూల్ ఉన్నారు.

About Author