పూర్వ విద్యార్థులు …కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం
1 min read

హోలగుందన్యూస్ నేడు: యం.వి. ఫౌండేషన్ పూర్వ విద్యార్థుల మరియు కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహణకర్నూలు జిల్లా పరిధిలో యం.వి. ఫౌండేషన్ ఆధ్వర్యంలో పూర్వ విద్యార్థులు మరియు కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం (గెట్ టుగెదర్ ) ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పద్మశ్రీ, రామన్ మెగసేసే అవార్డు గ్రహీత, జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ మాజీ చైర్పర్సన్ శ్రీమతి శాంత సిన్హా హాజరై కార్యక్రమాన్ని శోభాయమానం చేశారు. ఈ సమావేశానికి సుమారు 300 మంది ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు మరియు విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సభకు అరుణ కుమారి మరియు ఎస్. విజయభాస్కర్ అధ్యక్షత వహించారుఅలాగే గతంలో యం.వి. ఫౌండేషన్‌లో సేవలందించి ప్రస్తుతం ప్రజాప్రతినిధిగాకొనసాగుతున్న కెంచప్ప ని ప్రత్యేకంగా సన్మానించడం జరిగింది.మండల కోఆర్డినేటర్లు సేవ నాయక్, భారతి, మల్లేశ్వరి, సేకన్న, విజయ్, ముల్లసాబ్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ ఆత్మీయ సమ్మేళనం పూర్వ విద్యార్థుల మధ్య అనుబంధాన్ని మరింత బలపరచడంతో పాటు యం.వి. ఫౌండేషన్ ద్వారా సాధించిన విజయాలను గుర్తు చేసే వేదికగా నిలిచింది. కార్యక్రమం ముగింపులో నిర్వాహకులు శాంత సిన్హా ని సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.

