జెడ్పీహెచ్ఎస్ హొళగంద లో జాతీయ విజ్ఞాన దినోత్సవం నిర్వహణ
1 min read

హోలగుంద న్యూస్ నేడు: జెడ్పీహెచ్ఎస్ హొళగుంద పాఠశాలలో జాతీయ విజ్ఞాన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమం లో ముఖ్య అతిథి డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్ ఉర్దూ కర్నూలు జిల్లా ఆదాం భాషా మరియు మండల విద్య శాఖ అధికారి-2 , ప్రధానోపాధ్యాయులు కబీర్ సాబ్ , ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు యూనిస్ భాషా , ఎస్ఎంసీ చైర్మన్ ద్వారాకానాథ్ మరియు సైన్ ఉపాధ్యాయులు కిరణ్ బాబు, యాదవ్ , రాధిక , గాయత్రి , చాముండి ఆధ్వర్యంలో జరిగింది. ఉదయం ప్రార్థన అనంతరం విద్యార్థులకు విజ్ఞాన దినోత్సవం యొక్క ప్రాముఖ్యతను వివరించారు.విజ్ఞానం మన దైనందిన జీవితంలో ఎంత ముఖ్యమో, శాస్త్రీయ దృక్పథం కలిగి ఉండటం ద్వారా సమాజ అభివృద్ధికి ఎలా తోడ్పడగలమో ఉపాధ్యాయులు వివరించారు. భారత ప్రముఖ శాస్త్రవేత్త సి.వి. రామన్ సేవలను స్మరించుకుంటూ, ఆయన చేసిన పరిశోధనలు దేశానికి గర్వకారణమని తెలిపారు.ఈ సందర్భంగా విద్యార్థులు సైన్స్ ప్రదర్శనలు, మోడల్ ఎగ్జిబిషన్, శాస్త్రీయ ప్రయోగాలు మరియు ప్రసంగ పోటీలలో పాల్గొన్నారు. చిన్న చిన్న ఆవిష్కరణలతో విద్యార్థులు తమ ప్రతిభను చూపించారు. ఉపాధ్యాయులు విద్యార్థులను ప్రశంసించి, భవిష్యత్తులో విజ్ఞాన రంగంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ప్రోత్సహించారు.ఈ కార్యక్రమం విద్యార్థుల్లో విజ్ఞానంపై ఆసక్తిని పెంపొందించడంలో ముఖ్యపాత్ర పోషించింది.

