NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఘనంగా సి.వి.రమణ జయంతి … జాతీయ విజ్ఞాన మేళా

1 min read

ప్యాపిలి న్యూస్ నేడు: ప్యాపిలి పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిరం లో సి.వి.రమణ  జయంతి సందర్బంగా నేషనల్ సైన్స్ డే నిర్వహించారు. ఈ కార్యక్రమం ను ఎఎస్ఐ వెంకటేశ్వర్లు భార్య సుధా మరియు ప్రభంధకారిణి సభ్యులు కృష్ణా రెడ్డి  సైన్స్ విజ్ఞానమేల ప్రారంభం చేశారు.ఈ కార్యక్రమం లో సుధా  చిన్నారులు అందరికి మిఠాయిలు పంచారు.సైన్స్ ఉపాధ్యాయులు ఎం. హరిత ,లావణ్య సివి రామన్ గురించి ప్రసంగించిరి.రిటైర్డ్ ప్రధానాచార్యులు బిఎస్ జయంతి లక్ష్మీ  జడ్జిమెంట్ చేశారు.చిన్నారుల ఎక్స్పీరిమెంట్స్ ఎంతగానో అలరించాయి. ప్రథమ బహుమతి విక్రమ్ ల్యాండర్ రఫీ 9వ తరగతి విద్యార్ధి , ద్వితీయబహుమతి సాయి పర్ణిక సోలార్ సిస్టమ్ 3వ తరగతి విద్యార్థిని , తృతీయ  బహుమతి దినేష్ రెడ్డి సెన్స్ ఆర్గాన్స్ ఎల్ కెజి విద్యార్ధి. సమితి వైస్ ప్రెసిడెంట్ భార్య కె. పార్వతమ్మ  చేతులమీద బహుమతులు ప్రధానం చేశారు. మొత్తం 59 ఎక్స్పీరిమెంట్స్ చిన్నారులు ప్రదర్శించారు.ఈ కార్యక్రమం లో ఆచార్యులు, చిన్నారులు పాల్గొన్నారు.

About Author