4న ” హలో బీసీ.. చలో తిరుపతి”
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: ఈనెల 4న తిరుపతిలో నిర్వహించనున్న “హలో బీసీ.. చలో తిరుపతి” మహాసభను విజయవంతం చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు పిలుపునిచ్చారు. సోమవారం కర్నూలు బీసీ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో జాతీయ ప్రధాన కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాసులు, రాష్ట్ర అధ్యక్షుడు నాగేశ్వర యాదవ్ మాట్లాడుతూ బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకువచ్చి అసెంబ్లీ, పార్లమెంట్‌లలో బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు.బీసీల హక్కులు, రిజర్వేషన్ల పరిరక్షణ కోసం రాష్ట్రవ్యాప్తంగా చర్చ ప్రారంభించాలనే ఉద్దేశంతో ఈ సమావేశాన్ని భారీ స్థాయిలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మహిళా బిల్లులో బీసీలకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలని, రాజకీయాల్లో బీసీలకు సముచిత ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. కేంద్ర మంత్రివర్గంలో బీసీలకు కీలక శాఖలు కేటాయించాలని డిమాండ్ చేశారు.రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న బీసీ భవనాలకు కేటాయించిన నిధులను పూర్తిస్థాయిలో విడుదల చేసి పనులను వేగవంతం చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.కార్యక్రమానికి జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య హాజరవుతారని వెల్లడించారు.

