NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రోడ్డు ప్రమాదంలో అసిస్టెంట్ లైన్ మెన్ మృతి, కేసు నమోదు..

1 min read

మృతి చెందిన ఏ ఎల్ ఎం ఈదుల శివ ప్రసాద్ రెడ్డి

చాగలమర్రి  న్యూస్​ (నేడు): మండల పరిధిలోని పెద్ద బోధనం గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనంపై విధి నిర్వహణలో భాగంగా సోమవారం రాంపల్లి గ్రామానికి వెళుతుండగా వెనుక వైపు నుండి వస్తున్న ఆటో ఢీకొంది. ఇరువురు రోడ్డుపై పడిపోగా తలకు బలమైన గాయమై తీవ్ర రక్తస్రావం జరిగింది. సంఘటనా స్థలంలో ఈదుల శివప్రసాద్ రెడ్డి (45) మృతి చెందగా, తిరుపతయ్యను నంద్యాల వైద్యశాలకు తరలించారని పోలీసులు తెలిపారు. ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి చెందిన ఈదుల శివప్రసాద్ రెడ్డి మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై రాజారెడ్డి మంగళవారం తెలిపారు.

About Author