NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎండవేడికి డంపింగ్ యార్డులో చెలరేగిన మంటలు

1 min read

పరిసర ప్రాంతాల ప్రజలు ఆందోళన,అదుపులో కి తెస్తామన్న నగరపాలక సంస్థ అధికారులు

 పరిసర ప్రాంతాలు పరిశీలించిన కో-ఆప్షన్ సభ్యులు ఎస్ఎన్ఆర్ పెదబాబు,ఎం,ఈడి,ఏఈలు

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఎండ వేడి కారణంగా చెత్తలో గ్యాస్ ఫామ్ అయి పోనంగి డంపింగ్ యార్డ్ లో చెలరేగిన మంటలు రెండు రోజుల్లో పూర్తిగా అదుపులోకి వస్తాయని చుట్టుపక్క ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని నగరపాలక సంస్థ కో-ఆప్షన్ సభ్యులు ఎస్ ఎం ఆర్ పెదబాబు తెలిపారు. బుధవారం సాయంత్రం మున్సిపల్ ఎం.ఈ సురేంద్రబాబు, డిఈ, ఏ ఈ లతో కలిసి డంపింగ్ యార్డ్ ఎస్ఎంఆర్ పెద్దబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ ఎండ వేడి కారణంగా గత పది రోజులు క్రితం పోనంగి డంపింగ్ యార్డ్ లో చెత్తలో ఆటోమెటిగ్గా తయారైనా మిథైన్ గ్యాస్ కారణంగా మంటలు వ్యాపించాయన్నారు. విషయం తెలిసిన వెంటనే ఏలూరు శాసనసభ్యులు  బడేటి రాధాకృష్ణయ్య,నగరపాలక సంస్థ మేయర్  షేక్ నూర్జహాన్ పెదబాబు,మున్సిపల్ కమిషనర్ ఆదేశాలతో ఇతర అధికారులు డంపింగ్ యార్డ్ కి వెళ్లి మంటలు అదుపు చేసే చర్యలు చేపట్టారు అన్నారు. రెండు జెసిబి లతో చెత్తను తిరగవేస్తూ పైపుల ద్వారా ఫోర్స్ గా వాటర్ ను పంపి మంటలను అదుపు చేస్తున్న తరుణంలో పొగ ఎక్కువగా వస్తుందని పొగను చూసి చుట్టుపక్క ప్రజలు ఆందోళన చెందవద్దని పెదబాబు తెలిపారు.ఇప్పటికే రెండుసార్లు డంపింగ్ యార్డ్ కు ఎమ్మెల్యే, మేయర్ విజిట్ చేశారని ఎప్పటికప్పుడే పరిస్థితులు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ప్రతిరోజు రెండు జెసిబిలు పనిచేస్తున్నాయన్నారు,ట్యాంకర్ల ద్వారా నీటిని తీసుకువచ్చి మంటలను అదుపు చేస్తున్నామన్నారు. భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు తక్షణమే చర్యలు తీసుకోవడం కోసం ప్రత్యేకంగా బోరు ఏర్పాటు చేస్తున్నామని పెదబాబు తెలిపారు. ఇప్పటికే 90 శాతం మంటలు అదుపులోకి వచ్చాయని మరో 10 శాతం మంటలు రెండు రోజుల్లో పూర్తిగా అదుపులోకి వస్తాయని చుట్టుపక్కల ప్రజలు ఆందోళన చెందవద్దని ఎస్ఎంఆర్ పెదబాబు ఈ సందర్భంగా తెలిపారు. నగరంలో రోజుకు 103 టన్నులు చెత్త సేకరణ జరుగుతుందన్నారు. వీటిలో 60 టన్నులు పొడి చెత్త 43 టన్నులు తడి చెత్త డంపింగ్ యార్డ్ కు చేరుతుందన్నారు. అయితే గతము నుండి పేరుకుపోయిన 53 వేల టన్నుల చెత్త బయో మైనింగ్ ప్రాసెసింగ్ ద్వారా 40 టన్నులు చెత్త ప్రాసెసింగ్ జరిగి సిమెంట్ ఫ్యాక్టరీలకు వెళ్తుందని త్వరలో మిగిలిన చెత్త కూడా ప్రాసెసింగ్ పూర్తి చేస్తారని ఈ సందర్భంగా ఎస్ ఎం ఆర్ పెదబాబు తెలిపారు.వీరితోపాటు ఏ.ఈ సంధ్య,కార్పొరేటర్లు బత్తిన విజయకుమార్,పాము శామ్యూల్ తదితరులు ఉన్నారు.

About Author