భూగర్భజలాలు మట్టములను స్వయంగా పరిశీలించిన జిల్లా కలెక్టర్
1 min read

భూగర్భ జలాలు మట్టములను ఎప్పటికప్పుడు అంచనాలు వేసి, పెంపుపై క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టాలి
లీకేజీలు నివారణ, ఇంకుడు గుంతలు-నీటి సంరక్షణే ప్రధాన లక్ష్యంగా పనిచెయ్యాలి
జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: పెదవేగి మండలం ముండూరు గ్రామంలో శనివారం రెండు ఫిజియో మీటర్లు నుండి టెలిమీటరు ద్వారా భూగర్భజలాలు మట్టములను స్వయంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో భూగర్భజలాలు స్థాయిని శాస్త్రీయంగా మట్టములనుఅంచనాను స్వయంగా పరిశీలించామని తెలిపారు. భూగర్భజలాలు స్థాయి నిరంతరం తగ్గిపోతున్న నేపథ్యంలో వాటిని కాపాడుకోవడం అత్యంత అవసరమని తెలిపారు. జిల్లాలో 72 పిజోమీటర్ల నుండి టెలిమీటర్ల ద్వారా భూగర్భ జలమట్టాన్ని ఎప్పటికప్పుడు కొలవడం జరుగుతుందని, మార్చి నెలలో జిల్లాలో సగటున నీటిమట్టం 21.23 మీటర్లు ఉందని అన్నారు. ఈ రోజున ముండూరు గ్రామంలో కొలిచినపుడు 23.38 మీటర్లు ఉందని తెలిపారు. వర్షాకాలం తర్వాత 3 మీటర్లు, ఎండాకాలం 8 మీ లోతులో ఉంచడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజున 100 రోజులు జలధార -జలహరతి కార్యక్రమం చేపట్టి వాననీటి సంరక్షణ చర్యలు వేగవంతం చేసిందని తెలిపారు. జలమట్టాన్ని క్రమం తప్పకుండా పరిశీలించడం ద్వారా భవిషత్తు నీటినిర్వహణకు సమగ్ర ప్రణాళికలు రూపొందించవచ్చునని పేర్కొన్నారు.జిల్లాలో గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పిజియోమీటర్లను నిరంతరం పర్యవేక్షించాలని,సేకరించిన డేటా అనుగుణంగా భూగర్భజలాలు స్థాయిని పెంచుటకు చర్యలు చేపట్టాలని, ఇందుకు నిధులు కొరతలేదని స్పష్టం చేశారు. అలాగే ప్రజల్లో నీటి సంరక్షణపై అవగాహన పెంపొందించడానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రౌండు వాటరు డిడి పైలా కోదండరామ్, టెక్నికల్ సిబ్బంది పాల్గొన్నారు.

