NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వ్యవసాయ కార్మిక సంఘం 13వ జిల్లా మహాసభలను జయప్రదం చేయండి

1 min read

న్యూస్ నేడు, పత్తికొండ:  ఈనెల 29, 30వ తేదీలలో ఆస్పరి మండల కేంద్రంలో  ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జరుప తలపెట్టిన 13వ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని    ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం 13వ జిల్లా మహాసభలు జయప్రదం చేయాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షులు బి వీరశేఖర్ పిలుపునిచ్చారు.శనివారం నాడు స్థానిక ఈశ్వర్ రెడ్డి భవన్ నందు మహాసభలకు సంబంధించిన కరపత్రాలను ఆయన మండల నాయకత్వంతో కలిసి విడుదల చేశారు. సంఘం మండల కార్యదర్శి బుజ్జిలు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, భూమికోసం, భుక్తి కోసం, విముక్తి కోసం కష్టజీవుల పక్షాన పోరాడిన వ్యవసాయ కార్మిక సంఘం నేడు భూ పంపిణీ, సంక్షేమం, ఉపాధిపై ఉద్యమిస్తుందని పేదలపై ప్రభుత్వాల వివక్షకు వ్యతిరేకంగా నిత్యం పోరాటాలు నిర్వహిస్తుందని పేర్కొన్నారు.  ప్రతి పేదకు  భూమి ఇవ్వాలని ,అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాల అమలు అదేవిధంగా అందరికీ ఉపాధి కొరకు రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున వ్యవసాయ కార్మిక సంఘం నాయకత్వంలో ప్రజల సమీకరించి పోరాడుతామని ఆయన స్పష్టం చేశారు. ఈనెల 29,30 తేదీలలో ఆస్పరీ లో జరుగు సంఘం 13వ జిల్లా మహాసభల నేపథ్యంలో వ్యవసాయ కార్మిక సంఘం అఖిల భారత ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ బి వెంకట్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి వెంకటేశ్వర్లు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గౌస్ దేశాయ్  ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారని తెలిపారు. కష్టజీవులు వ్యవసాయ కార్మికులు ఈ సభలకు పెద్ద ఎత్తున హాజరై మహాసభలను జయప్రదం చేయడం ద్వారా కూలీల, శ్రామికుల ,కష్టజీవులు ఐక్యతను చాటుదామని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగాఈ నెల 20 వ తేదీ న గ్రామీణ ఉపాధి హామీ సమస్య లపై, అందరికీ ఉపాధి కల్పించాలని డిమాండ్తో ఎంపీడీవో కార్యాలయం ముందు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన .

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *