NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పాఠశాల … అంగన్వాడీ కేంద్రాన్ని  ఆకస్మిక తనిఖీలు: ఎమ్మెల్యే కోట్ల

1 min read

ప్యాపిలి న్యూస్ నేడు: డోన్ మండలంలోని మల్యాల గ్రామంలో ఉన్న మండల పరిషత్ ఉన్నత పాఠశాల మరియు అంగన్వాడీ కేంద్రాన్ని  డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి  ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న బోధన, మౌలిక వసతులు, పరిశుభ్రత పరిస్థితులను ఎమ్మెల్యే సమగ్రంగా సమీక్షించారు. అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు అందుతున్న పోషకాహారం, ఆరోగ్య సేవలు, సదుపాయాలపై కూడా ప్రత్యేక దృష్టి సారించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి, సేవల నాణ్యతను మరింత మెరుగుపర్చాలని సూచనలు చేశారు.అంగన్వాడీ కేంద్రంలో ఉపాధ్యాయురాలు గైర్హాజరు కావడంతో ఎమ్మెల్యే  తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం సహించబోమని హెచ్చరిస్తూ, సంబంధిత అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *