ప్రతి ఇంటికి సురక్షిత త్రాగే నీరు అందించటమే కూటమి ప్రభుత్వ లక్ష్యం : కత్తిరి వెంకటరమణ
1 min read

సారవకోట, న్యూస్ నేడు : మండలం గుమ్మపాడు పంచాయతీలో కూటమి ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ (2.0) కింద గ్రామీణ తాగునీటి సరఫరా రంగంలో నిర్మాణాత్మక సంస్కరణలపై దృష్టి సారించి, పెరిగిన వ్యయం మరియు పునర్‌వ్యవస్థీకరించిన జేజేఎం కాలపరిమితిని డిసెంబర్ 2028 వరకు పొడిగించడానికి కేబినెట్ ఆమోదం తెలిపిందని సారవకోట మండల టీడీపీ అధ్యక్షులు కత్తిరి వెంకటరమణ అన్నారు .వైకాపా ప్రభుత్వంలో నిధులు కేటాయింపు కేవలం కాగితలకే పరిమితం కావటం నిధులు విడుదల జాప్యం కారణం పనులు మందగించడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి ఈ స్కీం కాల పరిమితను పొడిగించడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వ వాటాను కూడా మ్యాచింగ్ ఇవ్వడానికి సంసిద్ధత వ్యక్తం చేయటము వలన ఇంటింటికి మంచినీరు సప్లై పనులు ప్రారంభించడం జరిగిందన్నారురాష్ట్రంలో మూడు మెగా డ్రింకింగ్ ప్రాజెక్టులు మంజూరు కాగా అందులో ఒకటి శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మరియు టెక్కలి నియోజకవర్గంలోని ప్రతి గృహానికి సురక్షిత మంచినీరు ఇవ్వడమే లక్ష్యంగా రూ.1260 కోట్ల రూపాయలు కేటాయించటానికి కృషి చేసిన కేంద్ర మంత్రివర్యులు శ్రీ కేంద్ర కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కింజరాపు అచ్చం నాయుడు, నరసన్నపేట శాసనసభ్యులు శ్రీ బగ్గు రామమూర్తి కి సారవకోట మండలం ప్రజలు తరపున కృతజ్ఞతలు తెలియచేస్తున్నారు.

