కూటమి ప్రభుత్వంపై జగన్ విమర్శలు దొంగే దొంగ దొంగ అన్నట్లుంది
1 min read

టిడిపి అధ్యక్షులు గుడిసె ఆదికృష్ణమ్మ
కర్నూలు, న్యూస్ నేడు: వైఎస్ఆర్సిపి అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి నిన్నటి దినము మీడియా ప్రతినిధుల సమావేశంలో నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేయడాన్ని కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుడిసె ఆది కృష్ణమ్మ తీవ్రంగా ఖండించారు. ఈరోజు వారు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం కర్నూలు నుండి పత్రికల వారితో మాట్లాడుతూ రాష్ట్రంలో 2019 నుండి 2024 వరకు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశాడని, వైసిపి ప్రభుత్వం హయాంలో ఏ ఒక్క సామాజిక వర్గం వారికి కూడా న్యాయం చేకూర్చలేదని ముఖ్యంగా రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థను పూర్తిగా అస్తవ్యస్తంగా మార్చివేసి తన అన్యాయులకు దోచి పెట్టేందుకు ఎన్నో అక్రమ మార్గాలను చూపించాడని అలాంటి వ్యక్తి నేడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ రాష్ట్రంను అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నారని ముసలి కన్నీరు కారుస్తున్న జగన్మోహన్ రెడ్డి తన ఐదు సంవత్సరాల పాలనలో రాష్ట్రంలో ఏ ఏ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేశారు ప్రజలకు వివరిస్తే బాగుంటుందని ఆమె సూచన చేశారు. జగన్మోహన్ రెడ్డి అధికార మదంతో ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు రాష్ట్రంలోని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నాయకుల పైన కక్ష సాధింపు చర్యలకే తన పూర్తి సమయాన్ని కేటాయించారని ఏ కారణం లేకుండా ఆనాడు అరెస్టుల పర్వం కొనసాగించారని గుర్తు చేశారు .రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వము అభివృద్ధి సంక్షేమము సమాన దృష్టితో ముందుకు నడిపిస్తున్నారని అలాగే గత సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను అన్నింటిని నెరవేర్చి ప్రజల మద్దతును చురగున్నారని ఇది జీర్ణించుకోలేని జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వము పైన చంద్రబాబు నాయుడు పైన తప్పుడు ప్రచారానికి పూనుకుంటున్నారనిను తనలాగా చంద్రబాబునాయుడు ఏ రోజు వరదాల చాటు రాజకీయం చేయలేదని అనునిత్యం ప్రజల మధ్యనే ఉంటూ వారి శ్రేయస్య ధ్యేయంగా పనిచేయుచున్నారని జగన్ చేసే ఆరోపణలను చూస్తే దొంగే దొంగ దొంగ అన్నట్లు జగన్ ధోరణి ఉందని తెలియజేశారు.

