కిక్‌బాక్సింగ్ జోనల్ లెవల్ సౌత్ జోన్ పోటీలలో కర్నూలుకు రెండు పథకాలు..
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: బెంగళూరులోని కోరమాండల్ ఇండోర్ స్టేడియంలో కర్ణాటక అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 5 నుండి 8 వరకు నిర్వహించిన అస్మిత ఖేలో ఇండియా కిక్‌బాక్సింగ్ జోనల్ లెవల్ సౌత్ జోన్ పోటీలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 41 మంది బాలికలు పాల్గొన్నారు. ఈ పోటీలలో ఆంధ్రప్రదేశ్ జట్టు 1 బంగారు, 4 వెండి, 12 కాంస్య పతకాలు సాధించింది.ఈ సందర్భంగా కర్నూలుకు చెందిన పూజిత జూనియర్ విభాగంలో -65 కిలోల బరువు విభాగంలో వెండి పతకం సాధించగా, సహస్ర జె సబ్ జూనియర్ విభాగంలో 37 కిలోల బరువు విభాగంలో కాంస్య పతకం సాధించింది. ఈ ఇద్దరు క్రీడాకారిణులు తమ ప్రతిభతో పోటీలలో విజయం సాధించి నగదు బహుమతులు కూడా అందుకున్నారు.ఈ ఇద్దరు క్రీడాకారిణులు కర్నూలులోని త్రినాథ్ కిక్‌బాక్సింగ్ అకాడమీలో సాధన చేశారు. అకాడమీ చైర్మన్ త్రినాథ్ విజేతలను అభినందిస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.ఈ విజయంపై ఆంధ్రప్రదేశ్ కిక్‌బాక్సింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆనంద్ బాలు, రాష్ట్ర కార్యదర్శి నరేంద్ర ఆచారి విజేతలను అభినందించారు.


