ఏపీ రాష్ట్ర రిజిస్ట్రేషన్ .. స్టాంప్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఎన్నికలు
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: విశాఖపట్నం లో జరిగిన ఎన్నికల్లో ఆంద్రప్రదేశ్ రాష్ట్ర రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షులు గా జి . బాల సుబ్రమణ్యము (సబ్ రిజిస్టర్,శిరివెల్ల) నాల్గవ జోన్ వైస్ ప్రసిడెంట్ గా ఎం. ఆది నారాయణ (సబ్ రిజిస్టర్, బండి ఆత్మగూరు) ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు కర్నూలు జిల్లా స్టాంపు మరియు రిజిస్ట్రేషన్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాస్ రావు సోమవారం మీడియా కు తెలిపారు.అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సబ్ రిజిస్టర్ అసోసియేషన్ నాల్గవ జోన్ ట్రెజరర్ గా ఎన్. ఫిరోజ్ ( సబ్ రిజిస్టర్, ఓర్వకల్ ) ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సబ్ రిజిస్టర్ శ్రీనివాస్ రావు వెల్లడించారు.

