NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మంత్రాలయం లో పొట్టి శ్రీరాములు విగ్రహా ఏర్పాటు కు కృషి

1 min read

తెలుగు ప్రజల కోసం ప్రాణ త్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు

మంత్రాలయం టీడీపీ ఇంచార్జ్ రాఘవేంద్ర రెడ్డి

మంత్రాలయం న్యూస్ నేడు : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం లో అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహ ఏర్పాటుకు ఆర్యవైశ్యులు కలిసి వస్తే కృషి చేస్తానని ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం 58 రోజులు ఆమరణనిరహారదీక్శ చేసి ప్రాణ త్యాగం చేసిన మహానీయుడు శ్రీ పొట్టి శ్రీరాములు అని మంత్రాలయం టిడిపి ఇన్చార్జ్ మాధవరం రాఘవేంద్ర రెడ్డి పేర్కొన్నారు. సోమవారం నియోజకవర్గ కేంద్రమైన మంత్రాలయం  ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన అమరజీవి పొట్టి శ్రీరాములు 125 వ జయంతి వేడుకల్లో  మంత్రాలయం టీడీపీ ఇన్చార్జి శ్రీ ఎన్.రాఘవేంద్ర రెడ్డి, యువ నాయకులు రాజారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్  అమరావతిలో 58  అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహ ఆవిష్కరణను పురస్కరించుకుని నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌ను ఎంపీడీఓ కార్యాలయంలో వీక్షించారు. అనంతరం మంత్రాలయం లో  ఏర్పాటు చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ  మనం తెలుగు తల్లికి, తెలుగు ప్రజల కోసం గొప్ప త్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు  గౌరవప్రదంగా నివాళులు అర్పిస్తున్నామన్నారు. ఆయన త్యాగం వల్లే మనం గర్వంగా పిలిచే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిందని తెలిపారు. ఆయన చేసిన 58 రోజుల నిరాహార దీక్ష వ్యక్తిగత గుర్తింపుకోసం కాదు, అధికారంకోసం కాదు — తెలుగు ప్రజల భాష, గుర్తింపు, ఆత్మగౌరవం కోసం చేసిన అత్యున్నత త్యాగం అని కొనియాడారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడే పార్టీగా నిలిచిందన్నారు. రాష్ట్ర గౌరవం కోసం త్యాగం చేసిన మహనీయులను ఎప్పటికీ గౌరవిస్తూనే ఉంటుందని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు  నాయకత్వంలో అమరజీవి పొట్టి శ్రీరాములు  త్యాగం ప్రతి ఇంటికి చేరేలా మనమంతా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్, డీపీవో భాస్కర్ ,ఎంపీడీఓ నూర్జహన్ , సీఐ రామాంజులు, ఎస్ఐ మల్లికార్జున, నియోజకవర్గ స్వర్ణంద్ర ప్రొఫెషనల్ ఆఫీసర్ రాజు, టిడిపి నాయకులు అశోక్ రెడ్డి,ఎంపీటీసీ లు వెంకటేష్ శెట్టి ,మేకల వెంకటేష్, టౌన్ అధ్యక్షులు వరదరాజులు,ఆర్యవైశ్య సేవాసంగం అధ్యక్షులు వెంకటేష్ శెట్టి,ప్రహ్లాదశెట్టి,దామోదర్ గుప్తా,రమేష్, సూర్యప్రకాష్, వజన్న శెట్టి,సాయిరాం,కృష్ణయ్య శెట్టి, మురారి నాగరాజు, నగేష్, అశ్వత్ నారాయణ శెట్టి,ఫణిరాజు,మల్లి, రఘు,పవన్,డీసీసీ తిమ్మప్ప, సూగురు సాగునీటి సంఘం ఛైర్మెన్ నరసింహులు, రఘు, వెంకటేష్,సచివాలయం సిబ్బంది,పొదుపు సంఘంలా సిబ్బంది,టీడీపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author